దేశవ్యాప్తంగా వందేభారత్ స్లీపర్ రైళ్లలో స్లీపర్ క్లోచ్లను అభివృద్ధి చేసే ప్రక్రియలో భారతీయ రైల్వే శాఖ నిమగ్నమైంది. ఇవెలా ఉండబోతున్నాయో తెలియజేస్తూ ముందుగా కొన్ని పిక్స్ రిలీజ్ చేశారు. ఆ ఫొటోస్ చూస్తుంటే ఇది ట్రైన్ జర్నీనా? ఫ్లైట్ జర్నీనా అంటున్నారు నెటిజన్లు.. ఫీచర్స్ అలా ఉన్నాయి మరి. ఇప్పటి వరకూ వందే భారత్ రైళ్లలో సింగిల్-సీటర్ కోచ్‌లను మాత్రమే ఉండేవి…కేవలం పగటిపూట మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇకపై నైట్ జర్నీ చేసేందుకు వీలుగా కోచ్ లను అభివృద్ధి చేస్తోంది భారతీయ రైల్వే శాఖ..
3 రకాల కోచ్ లు
కొత్త వందే భారత్ స్లీపర్ కంపార్ట్మెంట్ రైలు రూపకల్పన ఎలా ఉందంటే… ఈ రైలు ముందు భాగం డేగ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 11.. 3 టైర్ ఏసీ కోచ్‌లు, నాలుగు 2 టైర్ ఏసీ కోచ్‌లు , ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేశారు. మొత్తం 823 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించవచ్చు. 3-టైర్ ఏసీ కోచ్‌లలో 611 మంది, 2-టైర్ ఏసీ కోచ్‌లలో 188 మంది ప్రయాణికులు, 1st క్లాస్ కోచ్‌లో 24 మంది ప్రయాణికులు ప్రయాణించేలా తీర్చిదిద్దారు.
సౌకర్యాలు సూపర్బ్
3 టైర్ ఏసీ కోచ్‌కు సంబంధించి ప్రస్తుతం ఉన్న రైలు కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉండేలా రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఇందులో అదనపు కుషన్ బెడ్లను ప్రవేశపెట్టారు. ఇది రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో సీటింగ్ సౌకర్యం కంటే మెరుగ్గా ఉంటుంది.
@ స్లీపర్ రైలు లోపలి భాగం క్రీమ్, పసుపు రంగులతో ఆకర్షణీయంగా రూపొందించారు
@ బెర్త్‌ల పైకి ఎక్కేందుకు.. సులభంగా నిచ్చెన ఏర్పాటు చేశారు
@ రైలులో అన్నీ సెన్సార్ లైట్లనే ఉపయోగించారు. రాత్రి సమయంలో వారు నడుస్తున్న ప్రాంతంలో ఆటోమేటిక్‌గా లైట్లు వెలుగుతాయి. ప్రయాణికులు లేని సమయంలో లైట్లు ఆరిపోతాయి. దీని ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది.
@ రైలు లోపల డోర్లు.. ఒక కంపార్ట్మెంట్ నుంచి మరో కంపార్ట్‌మెంట్‌కు వెళ్లే డోర్లు, టాయిలెట్ ప్రాంతంలోని డోర్లు అన్నిటిని ఆటోమేటిక్‌గా రూపొందించారు. ఇవి సెన్సార్ ఆధారంగా పనిచేస్తాయి.
@ బయో టాయిలెట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా దుర్వాసన బయటకు రాకుండా ఉంటుంది. వికలాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాలు కూడా అందిస్తున్నారు.
@ ఫస్ట్ క్లాస్ AC కంపార్ట్మెంట్లో, బాత్రూమ్ల్లో స్నానం చేయడానికి షవర్ , హాట్ వాటర్ సౌకర్యాలు కూడా ఉండటం విశేషం.
ఈ రైలును గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణించగలిగేలా రూపొందించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగానికి మాత్రమే పరిమితం చేశారు