హిందూపురం సహా 5 లోక్‌సభ, 9 అసెంబ్లీ సీట్లు – బీజేపీ హైకమాండ్‌కు టీడీపీ ప్రతిపాదన

బీజేపీతో కలిసి నడిచేందుకు తెలుగుదేశం- జనసేన ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో పోటీ ఎలా అన్న విషయాన్ని బీజేపీ ఎట్టకేలకు తేల్చింది. చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్లుగా పాత ఎన్డీఏ గ్రూపు మళ్లీ పోటీ చేయబోతోంది. తెలుగుదేశం -జనసేన కలిసి నడవాలని చాన్నాళ్ల క్రితమే నిర్ణయించుకున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పి అభ్యర్థులను కూడా అనౌన్స్ చేశారు. ఇన్నాళ్లు ఏ విషయం తేల్చకుండా వస్తూ ఉన్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో కలిసేందుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది.

నేడో రేపో ప్రకటన

ఎన్డీఏలో ఉన్న పవన్ కల్యాణ్.. టీడీపీని కూడా కూటమిలో చేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. అయితే ఇన్నాళ్లుగా ఏ విషయం తేల్చకుండా వస్తున్న బీజేపీ ఎట్టకేలకు కూటమిలో చేరేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తిరిగి ఎన్టీఏలోకి చేరుతున్న విషయాన్ని బీజేపీ అధికారికంగా వెల్లడించనుంది. NDA లోకి తెలుగుదేశం చేరిన విషయాన్ని ప్రకటించిన వెంటనే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. మార్చి 4వతేదీన సీట్ల ప్రకటన కూడా చేస్తారని చెబుతున్నారు.

బీజేపీ పోటీ చేయబోయే సీట్లు ఇవే…!

బీజేపీ ప్రధాన లక్ష్యం లోక్‌సభ ఎన్నికలు కాబట్టి వారి ఫోకస్ వాటి పైనే ఉంది. పొత్తులపై ప్రకటన ఇంకా రానప్పటికీ సీట్ల సంఖ్య, కేటాయింపు విషయంలో బీజేపీ -టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీకి 5 లోక్‌సభ, 9 అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం. అరకు, తిరుపతి, హిందూపురం, కర్నూలు , రాజమండ్రి లేదా ఏలూరు స్థానాలను బీజేపీకి కేటాయించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.

కీలక అసెంబ్లీ స్థానాల్లో పోటీ

అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. శ్రీకాకుళం, విశాఖ ఉత్తరం.. మాడుగుల, జమ్మలమజడుగు, ధర్మవరం, మదనపల్లి, తిరుపతి, పాడేరు,కైకలూరు, నర్సరావుపేటలలో 9 స్థానాలను కేటాయించేందుకు అంగీకారం కుదిరిందని చెబుతున్నారు. రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున వీలైనంత తొందరగా అభ్యర్థులను కూడా ప్రకటించేసి ఎన్నికల పోరాటంలోకి దూకేయాలని మూడు పార్టీలు అనుకుంటున్నాయని చెబుతుననారు.