సమ్మర్ అంటేనే చెమట చికాకు మొదలవుతుంది. ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు వేసుకుంటారు. ఇంతకీ చమట పట్టడం ఆరోగ్యానికి మంచిదా – కాదా?
ప్రకృతి ప్రసాదించిన వరం
చెమట పట్టడం అనేది ప్రకృతి ప్రసాదించిన వరం. శరీరంలో ఉండే అధిక వేడి చెమట ద్వారా బయటకుపోతుంది. ఉష్ణోగ్రత తగ్గించడమే ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ ఇతర పరిస్థితులలో కూడా చెమట్లు పడుతుంది. భయం, టెన్షన్, ఆందోళన స్థితిలో శరీరం కూడా చెమటలు పడతాయి. శారీరక శ్రమ పెరిగినప్పుడు, సూర్యకాంతి పెరిగినప్పుడు, గదిలో గాలి వీచనప్పుడు…శరీర ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే ఎలా పట్టినా చెమట్లు ఆరోగ్యానికి మంచిదే..
ఆరోగ్యానికి మేలు
చెమట పట్టడంవల్ల శరీరంలో అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. చెమట రక్తం నుంచి విషాన్ని, ఉప్పును తొలగిస్తుంది…ఇది గుండెకు చాలా మంచిది. మన చర్మంలో లక్షలాది చిన్న చిన్న రంధ్రాలు అడుగుభాగంలో స్వేద గ్రంథులు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా చెమట బయటకు వస్తుంది. చర్మ సంరక్షణకు, కాంతికి ఇది చాలా అవసరం.
కిడ్నీ పనితీరు మెరుగుపడుతుంది
విపరీతంగా చెమట్లు పట్టడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ పెరుగుతుంది. అందుకే ఎక్కువ నీరు తాగడం వల్ల కిడ్నీ పనితీరు కూడా మెరుగుపడుతుంది. శారీరక శ్రమ ద్వారా చెమట పట్టిన ప్రతిసారీ మనస్సు రిఫ్రెష్ అవుతుంది. చెమట… మానసిక స్థితిని సంతోషంగా ఉంచడంలో సహాయపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల శరీరంలో సహజనొప్పి తగ్గుతుంది. చెమట ద్వారా బ్లాక్ హెడ్స్, మొటిమలు తగ్గుతాయి. చెమట ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే చెమటలు పట్టాల్సిందే అంటారు ఆరోగ్య నిపుణులు. ఆవిరి స్నానం కూడా అందుకే చేస్తారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.