సమన్యాయ పాలనతో సామాజికాభివృద్ధి

ఎన్డీయే ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన జాతి అభివృద్ధికి నిదర్శనంగా నిలిచింది. ప్రధాని మోదీ చూపించే క్రమశిక్షణ, అంకితభావం ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ అందరిలోనూ ఏదో సాధించాలన్న తపనకు అవకాశం ఇస్తోంది.దానితో జనాభా ఎక్కువ ఉన్న పేద రాష్ట్రాలు కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో పోటీ పడుతున్నాయి.గత పొరబాట్లను సర్దుకుంటూ ముందుకు సాగుతున్నాయి.

యూపీని ఆదర్శంగా తీసుకోవాలంటున్న మోదీ

ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్న రోగ్జార్ మేళా (ఉద్యోగ తిరునాళ్లు)లో 51 వేల మందికి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తర ప్రదేశ్ ప్రజల గ్రోత్ స్టోరీని గుర్తుచేశారు. ఒకప్పుడు బాగా వెనుకబడిపోయిన ఉత్తరన ప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు అందరితో పోటీ పడి ముందుకు పరుగులు తీస్తోందన్నారు. నాడు నేరాలకు కేంద్రమైన అతి పెద్ద రాష్ట్రం ఇప్పుడు శాంతికి నిలయమైందన్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా సుఖశాంతులతో నివసిస్తున్నారన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే రాష్ట్రాల్లో పెట్టుబడులు కూడా తగ్గుముఖం పడతాయని, యూపీలో మాత్రం పోటీ పడి పరిశ్రమలు స్థాపిస్తున్నారని మోదీ గుర్తు చేశారు.

నూతన భారతావని దిశగా అడుగులు

దేశం ఇప్పుడు మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. బహుశా ప్రధాని మోదీ కూడా అదే అంశాన్ని ప్రస్తావించి ఉండొచ్చు. అన్ని రంగాలు అభివృద్ది చెందితేనే ఎకానమీ మెరుగు పడుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆహారం నుంచి ఔషధ పరిశ్రమ వరకూ అన్నింటా వృద్ధి రేటు కనిపిస్తుంది. అందుకే దేశ ప్రజలందరి మొహంలో సంతోషం కనిపిస్తోంది.

అభివృద్ధిలో పెరిగిన పర్యాటకం వాటా…

దేశంలో పర్యాటక రంగంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. 2023 నాటికి ఆర్థిక వ్యవస్థలో టూరిజం వాటా రూ. 20 లక్షల కోట్లకు చేరాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా ఇప్పటి నుంచే రాష్ట్రాలకు రాయితీలు ఇస్తోంది. దీని వల్ల 15 కోట్ల వరకు కొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం రూ.4 లక్షల కోట్లు ఉన్న ఫార్మా రంగం 2030 నాటికి రూ. 10 లక్షల కోట్లకు చేరాలి. ఇక ప్రస్తుతం రూ. 26 లక్షల కోట్లున్న ఫుడ్ ప్రాసెసింగ్ రంగం అప్పటికి కనిష్టంగా రూ. 35 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఆటోమొబైల్ రంగంతో పాటు, విడి భాగాల ఉత్పత్తి కూడా బాగా పెరిగింది. దీని వల్ల యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డాయి. 2030 నాటికి ఆ రంగంలో వృద్ధి రేటు రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఎందకంటే జనంలో వాహనాల వినియోగం బాగా పెరిగింది. భారతీయ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు విదేశీయులు పోటీ పడుతున్నారు. అందుకే మన దేశం మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారేందుకు పోటీ పడుతోందని చెప్పాలి…