అప్పుడే ఓటర్లను బెదిరిస్తున్న రేవంత్ రెడ్డి – సరుకు అయిపోయిందా ?

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలను వంద శాతం అమలు చేయడానికి అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. ఇప్పుడు ఆయన స్టేట్‌మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం వెదికినా హామీలు అమలు చేయాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే షరతును ఎక్కడా పెట్టలేదు. కానీ లోక్ సభ ఎన్నికల భయంతో బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించారు.

ఓటర్లను బెదిరిస్తే శంకరగిరి మాన్యాలే !

తమకు ఓటేయకపోతే పథకాలు అందవు అని ప్రతి ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా ఓటర్లను బెదిరిస్తూనే ఉంటాయి. అయితే ఈ బెదిరింపులు అందుతున్నప్పుడే చేస్తారు. అంటే అమల్లోకి వచ్చిన తర్వాత ఆగిపోతాయని బెదిరిస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పథకాల అమలు ప్రారంభించలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే నికరంగా అమల్లోకి వచ్చింది. ఇంకా ఆరు గ్యారంటీల్లో అత్యంత కీలకమైన పథకాలు అమలు కావాల్సి ఉంది. ఈ లోపే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ముఫ్పై రోజుల్లో పథకాలు అమలు చేస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాక.. వంద రోజులు అంటున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అమలు అంటున్నారు. ఈ వేరియషన్స్ చూసి ప్రజలకు కూడా అనుమానాలు ప్రారంభమవుతున్నాయి.

బీఆర్ఎస్‌కు అదే పరిస్థితి – రేవంత్ నేర్చుకోలేదా ?

రేవంత్ రెడ్డి చాలా త్వరగా ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఇవ్వకుండా.. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే అసలు ప్రారంభం కావని హెచ్చరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సంయమనంతో వ్యవహరించాల్సి ఉందన్న అభిప్రాయం సహజంగానే వినిపిస్తోంది., ఎందుకంటే .. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ ఓటర్లు అవేమీ నమ్మలేదు. కాంగ్రెస్ ను నమ్మారు. గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేయకపోతే పథకాలు రావని బెదిరించడం ఓ రకంగా ఆత్మవిశ్సాసాన్ని కోల్పోవడమే వుతుంది. రెండు నెలలకే రేవంత్ రెడ్డి ఇలా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయాల్సన పరిస్థితికి వచ్చి ఉంటే నిజంగా అది .. పతనమే అవుతుంది.

తెలంగాణలో బీజేపీకి పూర్తిగా సానుకూల వాతావరణం

తెలంగాణలో బీజేపీకి పూర్తిగా సానుకూల వాతావరణం కనపిసిస్తోంది. బీఆర్ఎస్ పనైపోవడం… కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో ప్రజల్ని మోసం చేయడం తో… ఎక్కువ మంది మోదీ సర్కార్ వైపు మొగ్గుతున్నారు. మోదీ మానియాతో పెద్ద ఎత్తున ఓట్లు బీజేపీకి దక్కనున్నట్లుగా తెలుస్తోంది. సర్వేల్లో కూడా బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయని చెబుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డిలో అసహనం పెరుగుతోందని చెబుతున్నారు.