తబ్లిగి జమాత్ కు ప్రజాధనం – మొదట్లోనే దారి తప్పిన రేవంత్ సర్కార్

తబ్లీగీ జమాత్‌కి తెలంగాణ సర్కార్ నిధులు విడుదల చేయడంపై వివాదం రాజుకుంది. తబ్లిగీ సదస్పు కోసం తెలంగాణ ప్రభుత్వం 2, 45 , 93,847 రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులు కేటాయింపు కేంద్రంగా ఇప్పుడు వివాదం కొనసాగుతుంది. తబ్లీగీ జమాత్‌కి నిధులు విడుదల చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నాయి హిందూ సంఘాలు.. బీజేపీ శ్రేణులు. మత మార్పిడులకు పాల్పడే సంస్థకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడమేంటని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

హైకోర్టులో పిటిషన్

తబ్లిగి జమాత్ కు నిధులు విడుదల పై హైకోర్టు లో పిటిషన్ దాఖలయింది. గద్వాల్ కు చెందిన అఫ్సర్ పాష పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 6,7 తేదీల్లో వికారాబాద్ లో తబ్లిగి జమాత్ సభలు జరగనున్నాయి. వీటి కోసం గత డిసెంబర్ 13 న నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేశారని కోర్టుదృష్టికితీసుకెళ్లారు. జీఓ ను సస్పెండ్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఉగ్రవాద సంస్థ తబ్లిగి జమాత్ కు నిధులు విడుదల చేయడాన్ని సవాలు చేశారు పిటిషనరన్.

అనేక దేశాల్లో తబ్లిగీ జమాత్‌పై నిషేధం

మన దేశంలో కరోనా విపరీతంగా పెరిగిపోవడానికి తబ్లిగీ జమాత్ ఓ కారణమని దేశమంతటా తెలుసు. దీనికిచాలా వివాదాస్పద చరిత్ర ఉంది. ఉగ్రవాదంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తబ్లీఘీ జమాత్ నాయకులు చెబుతూంటారు కానీ.. ఆయా ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. తబ్లీఘీ జమాత్ లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని, స్వయం నిర్ణయాధికారాన్నీ తిరస్కరిస్తుంది.
మహిళల్ని అణిచి వేస్తుంది. వారిని మనుషులుగా చూడదు. అల్-ఖైదా, లష్కర్-ఇ-తైబా వంటి జిహాదీ సంస్థలకు తబ్లీఘీ జమాత్ “ఒక పైపులైను, ఒక సారవంతమైన నియామక క్షేత్రం” అని అంతర్జాతీయ ఉగ్రవాద నిపుణులు విశ్లేషించారు. ఇస్లామిస్ట్ ఉగ్రవాదులలో 80 శాతం మంది తబ్లీఘీ శ్రేణుల నుండే వచ్చారని లెక్కలు చెబుతున్నారు. అందుకే సౌదీ అరేబియా సహా అనేక దేశాల్లో నిషేధం విధించారు.

కాంగ్రెస్ ఎందుకు ప్రోత్సహిస్తోంది ?

రేవంత్ రెడ్డి తబ్లిగీకి నిధులు మంజూరు చేయడానికి ప్రత్యేకమైన కారణం హైకమాండేనని చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఒత్తిడితోనే ఆయన నిధులు విడుదల చేయమని ఆదేశించి ఉంటారని చెబుతున్నారు. తెలంగాణపై మళ్లీ టెర్రరిస్టుల పడగనీడపడేలా చేసే కుట్ర జరుగుతోందని భావిస్తున్నారు. అందుకే ఈ సంస్థకు నిధుల విడుదలను తక్షణం నిలిపివేయాలని అనుమతులు కూడా రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.