కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ హత్యలు, అత్యాచారాలు, దౌర్జన్యాలు సర్వసాధారణమైన విషయంగానే పరిగణించాలి. దోపిడీదారుల రాజ్యానికి తెరతీయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారింది. కర్ణాటకలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నేరాలు పెరిగిపోతున్నాయి….
ఎన్నికల వేళ లవ్ జిహాద్ హత్య..
హుబ్బళ్లిలోని కాలేజీ క్యాంపస్లో కాంగ్రెస్ కౌన్సిలర్ కుమార్తె నేహా హిరేమత్ను హత్య సంచలనమైంది. ప్రేమ పేరుతో వేధించిన ఫయాజ్ అనే మాజీ క్లాస్ మేట్ .. ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. ఇదో విషాదమైన సంఘటన కాగా..కాంగ్రెస్ పార్టీ నిజం ఒప్పుకోకుండా కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. ఫయాజ్ హత్య చేశాడన్న విషయాన్ని అతని తల్లిదండ్రులు కూడా ఖండించలేదు. కాంగ్రెస్ ప్రోద్బలంతో వాళ్లు హత్య అంశాన్ని పక్కతోవ పట్టించే ప్రయత్నం మాత్రం చేశారు. హతురాలు, హంతుకుడు ప్రేమికులంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అయితే అదంతా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ అని తేలిపోయింది. హత్య పూర్తిగా లవ్ జిహాద్ అని నిరూపితమైనట్లు బీజేపీ ఒక ఛార్జ్ షీటు విడుదల చేసింది. చివరకు కాంగ్రెస్ పెద్దలు, ముఖ్యంగా హోం మంత్రి జీ.పరమేశ్వర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పక తప్పలేదు. ఐనా సరే కాంగ్రెస్ పార్టీని విశ్వసించేందుకు కన్నడ ప్రజలు సిద్ధంగా లేరు..
రాష్ట్రంలో పెరిగిన నేరాలు…
శాంతి భద్రతలు కాంగ్రెస్ పాలనలో పెద్ద సమస్యగా మారాయి. కాంగ్రెస్ పాలనలో నేరాలు విపరీతంగా పెరిగాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరాలు 46 శాతం పెరిగాయి. హత్యలు 31 శాతం, దోపిడీలు 41 శాతం పెరిగాయి. సైబర్ నేరాల కారణంగా రోజు కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ప్రతీ గంటకు ఒక సైబర్ నేరం నమోదయ్యే చోటు ఉందంటే అది కర్ణాటకేనని చెప్పాలి. సిద్దరామయ్య ప్రభుత్వం నేరాలను అదుపు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలున్నాయి…
టెక్ సిటీ నుంచి టాంకర్ సిటీ….
కర్ణాటక ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాని మోదీ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. సాఫ్ట్ వేర్ సహా ఇతర టెక్నాలజీ రంగాలకు పేరుపొందిన కర్ణాటక రాజధాని బెంగళూరు నగరాన్ని అథోగతిపాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకీ దక్కుతుందని మోదీ అన్నారు. ఇప్పుడు చుక్క నీరు లేక ప్రతీ ఇంటికి ట్యాంకర్లు తోలుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులకు వ్యతిరేకమని, ప్రైవేటు రంగాన్ని చంపేసిందని ఆయన గుర్తుచేశారు. సంపదను సృష్టించడం ఆ పార్టీకి చేతకాదని, పన్ను చెల్లించేవారిని మోసగిస్తున్నారని మోదీ ఆరోపించారు. వ్యవసాయం, పట్టణ మౌలిక సదుపాయాలకు కేటాయించే బడ్జెట్లో కోత విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అన్యాయం చేసిందన్నారు. బహిరంగంగా బాంబులు పేలుతున్నా సిద్దరామయ్య ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదన్నారు. బీజేపీకి ఓటేస్తే వ్యవస్థల మొత్తాన్ని గాడిలో పెడతామని మోదీ హామీ ఇచ్చారు….