ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒక్క రోజు ఏపీలో పర్యటనతో రాజకీయం మారిపోయింది. ఎటు చూసినా కూటమి రాజకీయ ప్రచారమే కనిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చిలుకలూరి పేట సభలో మోదీ ప్రసంగించారు. తర్వాత నాలుగో విడతలో ఏపీలో ఎన్నికలు ఉన్నందున ఇతర చోట్ల మోదీ ప్రచారం చేశారు. ఇప్పుడు పోలింగ్ దగ్గర పడుతున్నందున రెండురోజులు ఏపీకి సమయం కేటాయించారు. తొలి రోజు రాజమండ్రి, అకాపల్లిల్లో కూటమి అభ్యర్థులు ప్రచారం చేశారు.
వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీతో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకునేందుకు ఏపీ అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి తాము ఢిల్లీలో సపోర్ట్ చేస్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఇదంతా కూటమిలో బీజేపీ విషయంలో అనుమానాలు రేకెత్తించేందుకు చేస్తున్న ప్రయత్నంగా బీజేపీ హైకమాండ్ భావించింది. అందుకే ప్రధాని మోదీ రాజమండ్రి, అనకాపల్లిసభల్లో విరుచుకుపడ్డారు. ఏపీ లో మాఫియారాజ్ నడుస్తోందని దాన్ని అంతం చేయబోతున్నామని ప్రకటించారు. మోదీ ప్రసంగం… వైసీపీ నేతలకు గట్టి షాక్ లాంటిదే.
ఇరవై ఐదు లోక్ సభ సీట్లు – మోదీ పిలుపు
ఏపీలో ఉన్న ఇరవై ఐదు లోక్ సభ సీట్లలో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అసెంబ్లీలో మూడింట రెండు వందల మెజార్టీ ఇవ్వాలన్నారు. ఇప్పటికే కూటమి విజయం ఖాయమయిదని.. స్పష్టం చేశారు. వైసీపీకి 5 సంవత్సరాలు పాలించే అవకాశం వచ్చినా.. వారు ఉపయోగించుకోలేకపోయారని తెచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో వెనక్కి తీసుకెళ్లిందని .. అందుకే వైసీపీని ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారని ప్రకటించారు. అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదని ప్రకటించారు. మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేశారని.. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్ స్పీడ్తో పరిగెత్తిందన్నారు. ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందని… అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్గా తయారై దోపిడీకి పాల్పడ్డారన్నారు. కేంద్ర నిధులను ఎన్నో విధాలుగా ఇస్తున్నా అందుకోలేకపోయిదని మోదీ విమర్శించారు. అమరావతికి రూ.15 వేల కోట్లు ఇవ్వాలనుకున్నాం కానీ ప్రభుత్వం అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు అన్నదన్నారు. చివరికి ఒక్క రాజధాని కూడా లేకుండా దోపిడీ చేశారని ఆరోపించారు.
ఏపీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం
ఏపీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ ప్రచారంతో ఏపీలో రాజకీయ వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోయినట్లుగా కనిపిస్తోంది. మోదీ భ రోసా ఇవ్వడంతో ప్రజల్లోనూ సంతృప్తి వ్యక్తమవుతోది. కూటమి భారీ విజయానికి మోదీ ఇచ్చిన హమీ కీలకం కానుంది. బుధవారం కూడా మోదీ ప్రచారంలో పాల్గొంటారు.