ఏపీకి మోదీ సర్కార్ వేల కోట్ల నిధులు – మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేక నిర్వీర్యం చేసుకున్న వైసీపీ సర్కార్

పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక ఏటా రూ. పదిహేను వేల కోట్లు లాస్ చేసుకుంది ఏపీ ప్రభుత్వం . రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను రాష్ట్ర వాటా ఇవ్వలేక వదులుకున్న ఏపీ ప్రభుత్వ వ్యవహారశైలి ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. కేవలం తన వంతు మ్యాచింగ్‌ గ్రాంట్‌ వివిధ పథకాల కింద ఏటా రూ. 15 వేల కోట్లు వదులుకుంది.

గ్రాంట్ల కింద ఏటా రూ. ఇరవై వేల కోట్లు

వివిధ పథకాల కింద కేంద్రం రాష్ట్రానికి ఏటా దాదాపుగా రూ.20 వేల కోట్లు గ్రాంటు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.12వేల కోట్లు ఖర్చు చేసి ఆయా పథకాలను అమలు చేయాలి. పథకాలలో కేంద్రం కొన్నింటిని 90 శాతం, మరికొన్నింటిలో 70 శాతం ఇతరత్రా 60 శాతం వరకు తన వాటా నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నాళ్లు నిధుల మళ్లింపు చేశారు. ఆడిటింగ్‌లో బయటపడటంతో కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి పథకానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరవాలని రాష్ట్రం తన మ్యాచింగ్‌ గ్రాంటు మొత్తాన్ని అదే ఖాతాలో జమ చేసి . సంబంధిత పథకాన్ని నిక్కచ్చిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

మ్యాచింగ్ గ్రాంట్‌గా నిధులు విడుదల చేయని ప్రభుత్వం

130 కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు సంబంధించి 130 సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ బ్యాంకు ఖాతాలను తెరిచి.. కేంద్రం తన పథకాలకు నిధులు విడుదల చేసింది. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక మురిగిపోయిన నిధులు వెనక్కిపోయాయి. ఏటా రూ.15వేల కోట్ల కేంద్ర నిధులను వదులుకున్నట్లుగా తెలుస్తోంది. ఉపాధి హామీ పనులు, మిడ్‌డే మీల్స్‌, రహదారి పనులు, ఇంటింటికీ కొళాయి తదితర పథకాలకు ఆటంకం ఏర్పడింది. పేద గర్భిణులకు ఆర్థిక సహాయం అందించే ప్రధానమంత్రి మాతృ వందన యోజన సహా 130 పథకాలు సరిగ్గా అమలు చేయలేకపోయారు.

ప్రాజెక్టులు కూడా అందే !

ఆంధ్రప్రదేశ్‌లో రూ.70 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కేంద్రం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.1798 కోట్లు ఇవ్వక ఆగిపోయిన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. రైల్వేజోన్ కు స్థలం కేటాయించకకుండా ఆపడంతో అదీ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైల్వేస్టేషన్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తోంది కేంద్రం. ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై), సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) కింద పనులు .. కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం చొప్పు న నిధులు ఇస్తారు. వాటినీ ఉపయోగించుకోలేదు. ” అమృత్ పథకం కింద రూ.3762 కోట్లను కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయింపు .. మ్యాచింగ్ గ్రాంట్ నిధులివ్వక పనులు ఎక్కడిక్కకడే ఉండిపోయాయి.

అనేక అభివృద్ధి పనులకు అదే పరిస్థితి

గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కోసం కేంద్రం రూర్బన్ మిషన్ పథకం కింద రూ. 360 కోట్లకుపైగా ఇచ్చింది కేంద్రం. తన వాటా నిధులు చెల్లించకపోవడంతో సాగని పనులు సాగలేదు. ఫ్లైఓవర్లను నిర్మించడానికి వేల కోట్లు ఇస్తున్నా.. భూసేకరణ మాత్రం ప్రభుత్వం చేయడం లేదు. విజయవాడతో సహా రాష్ట్రంలో అనేక చోట్ల జాతీయ రహదారుల విస్తరణకు.. వంతెనకు అవసరమైన భూసేకరణ కు సహకరించలేదు ఎయిమ్స్ వంటి విద్యా సంస్థ పెడితే నీరు ఇవ్వడానికి ఆలోచిస్తున్న జగన్ సర్కార్ ప్రజల్ని మోసం చేస్తోంది.