వారసులకు అధికారం కట్టబెట్టడం ఒక తిరోగమన పోకడ. అది ప్రగతి నిరోధకం. ప్రధాని మోదీ తరచూ చెప్పే మాట ఇది. కాంగ్రెస్ తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీల్లో పరివార్ వాద్ కారణంగా దేశం దెబ్బతింటోంది. ఏదోక టైమ్ లో వాళ్లే గ్రూపులు అయిపోతారని బీజేపీ చెబుతుండేది. అప్పట్లో వాళ్లు ఒప్పుకోలేదు. ప్రస్తుత రాజకీయాలు బీజేపీ ఆలోచనా విధానానికి దర్పణం పడుతున్నాయి.
ప్రశ్నిస్తే మోదీపైనే అటాక్…
మోదీ తరచూ వారసత్వ రాజకీయాలను ప్రశ్నిస్తున్నారన్న అక్కసులో కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ఆయనపై మాటల దాడిని పెంచాయి. మోదీకి కుటుంబం లేనందున ఆయన అలా మాట్లాడుతున్నారని, ఆయన కుటుంబాన్ని వదిలేశారని ఆరోపిస్తున్నారు. అందుకు ప్రధాని చెప్పిన సమాధానంతో వారి దిమ్మతిరిగిపోయింది. దేశంలోని 140 కోట్ల మంది పౌరులు తన కుటుంబమేనని మోదీ ప్రకటించడంతో ఆయనకున్న ఫాలోయింగ్ చూసి ఇప్పుడు కాంగ్రెస్,ఇతర ప్రాంతీయ పార్టీలకు దిక్కు తోచడం లేదు. మోదీది వసుధైక కుటుంబకం అని తెలిసుకుని వాళ్లు సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తోంది.
ముక్కలు చెక్కలవుతున్న కుటుంబ పార్టీలు….
బిహార్లో పాశ్వాన్స్, హరియాణాలో చౌతాటాస్, మహారాష్ట్రలో పవార్స్ ఇలా చెప్పుకుంటూ పోతే 2019 ఎన్నికల తర్వాత చాలా కుటుంబ పార్టీలు చిన్నాభిన్నమైపోయింది. కీచులాడుకుని వేరు కుంపటి పెట్టుకున్నాయి. వాళ్ల కారణంగా ప్రభుత్వాలు కూలిపోయి కొత్త సర్కారులు ఏర్పడ్డాయి. గతి లేని పరిస్థితుల్లో కొన్ని గ్రూపులు వచ్చి బీజేపీ పంచన చేరాయి. జార్ఖండ్ రాష్ట్రంలో జేఎంఎం మాజీ శిబు సోరెన్ కోడలు సీతా సోరెన్ ఇప్పుడు బీజేపీలో చేరిపోవడం కుటుంబ పార్టీల్లోని విభేదాలకు దర్పణం పడుతోంది. ఈ ఏడాది ఆఖరిలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే ఇలాంటి పరిణామం బీజేపీకి కలిసొచ్చే అంశం. ఈ లోపు కమలం పార్టీ బలపడేందుకు కూడా అది ఉపయోగపడుతుంది…
కూలిన బీఆర్ఎస్ కోట.. మరికొన్ని పార్టీలు కూడా…
కుటుంబ పార్టీల్లో అవినీతి అందలం ఎక్కుతుంది. తెలంగాణలో అదే జరిగింది. నిన్నటి సీఎం కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్, తనయ కవిత, హరీష్ రావు, జోగినపల్లి సంతోష్ ఇలా కుటుంబమంతా పెత్తనం చెలాయించి అవినీతికి ఆలవాలమయ్యారు. ఇప్పుడు కవిత ఈడీ కస్టడీలో ఉంటే.. తక్కిన వారంతా భయం భయంగా గడుపుతున్నారు.మహారాష్ట్రలో శరద్ పవార్ బంధువు అజిత్ పవార్, ఎన్సీపీని చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. ఆయనకు అధికారం దక్కినప్పటికీ.. ఇప్పుడు అసలు పార్టీ మనుగడ ఏమిటన్నది ప్రశ్నార్థకమైంది. శరద్ పవార్ రాజకీయ సన్యాసం చేసినట్లేనా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పైగా ఆ కుటుంబంపైనా అవినీతి ఆరోపణలున్నాయి. అవినీతికి దిగే కుటుంబ పార్టీలపై పట్ల జనంలో సానుభూతి ఉండదని ఇప్పుడిప్పుడే నిరూపితమవుతోంది. తెలంగాణలో కవిత అయినా, జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ అయినా సరే వారి అరెస్టులను స్థానిక ప్రజలు పెద్దగా పట్టించుకున్న దాఖలు కనిపించడం లేదు. అంతా కర్మఫలమన్నట్లుగా జనం మాట్లాడుతున్నారు.వాళ్ల కంటే అవినీతి రహిత పాలన అందించే మోదీ పాలనే భేషుగ్గా ఉందని ప్రతీ ఒక్కరూ వేయి నోళ్ల ప్రశంసిస్తున్నారు….