డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు చక్కెర అనగానే భయపడిపోతుంటారు. కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. కొంతమంది అయితే, చక్కెర అధికంగా తీసుకోవడం వల్లే డయాబెటిస్ వస్తుందంటారు. స్వీట్స్ అధికంగా తినడం వల్లే డయాబెటిస్ వస్తుందనడంలో నిజమెంత…
చక్కెరతో డయాబెటిస్ వస్తుందా?
చక్కెరను నేరుగా తీసుకోవడం వల్ల మధుమేహం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. సాధారణంగా మధుమేహాన్ని షుగర్ అని కూడా అంటారు. అయినప్పటికీ, కుటుంబ చరిత్ర, జన్యువులు, వయస్సు, శరీర బరువు, పీసీఓఎస్, శారీరక శ్రమ స్థాయిలు టైప్-2 మధుమేహానికి ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు. కేవలం షుగర్ తింటే డయాబెటిస్ వస్తుందనడంలో ఎలాంటి వాస్తవం లేదు. డయాబెటిస్ వచ్చిన వాళ్లు షుగర్ తీసుకుంటే లెవల్స్ మరింత పెరుగుతాయని వద్దని సూచిస్తుంటారు.
జీరో షుగర్ డైట్ బెటర్
బరువు తగ్గడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు చక్కెర ఎక్కువగా తీసుకోవద్దని చెబుతారు. అయితే ఇది నిజమే. అధికంగా స్వీట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమే. పూర్తిగా మానేయడం కూడా సరికాదు. మీ ఆరోగ్య స్థితిని బట్టి స్వీట్స్ తీసుకోవాలి.
కృత్రిమ స్వీటెనర్లు కూడా ప్రమాదమే
మార్కెట్లో ఎక్కడ చూసినా కృత్రిమంగా తయారు చేసిన తీపి పదార్థాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి షుగర్ కంటెంట్ ఆహారాలు, పానీయాలతో మార్కెట్ సాధారణ ఉత్పత్తుల కన్నా ఆరోగ్యకరమైనవి అని నమ్ముతారు. పరిశోధన ప్రకారం.. కృత్రిమంగా తయారు చేసిన స్వీటెనర్‌లను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.. మోతాదుకు మించి తీసుకునే వారిలో మధుమేహం, క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
చక్కెర లేదా ఇతర ఏ తీపి పానీయాలు ఎక్కువగా తీసుకున్నా కావిటీస్ ఏర్పడతాయి. అందుకే కృత్రిమంగా తయారైన చక్కెర కన్నా సహజ చక్కెరను తీసుకోవడమే కొంతవరకూ ఆరోగ్యానికి మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.