‘హాయ్ నాన్న’..’దసరా’ రేంజ్ ని మించిపోతుందా!

దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్టందుకుని ఉత్సాహంగా ఉన్నాడు నాని. అప్పటి వరకూ క్లాస్ గా కనిపించిన నాని తనలో మాస్ యాంగిల్ పరిచయం చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఇదే క్రేజ్ కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉండిపోలేదు…తాజాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. మరి దసరా మూవీ సక్సెస్ ను కంటిన్యూ చేయగలడా?

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘హాయ్ నాన్న’. ఫాదర్-డాటర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ మూవీకి శౌర్యువ్ దర్శకుడు. తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్‌ 21న విడుదల చేసేందుకు ప్లాన్ చేయాలని నిర్ణయించారు మేకర్స్‌. అయితే సలార్‌ డిసెంబర్ 22న విడుదల కానుండగా.. క్రిస్మస్ సీజన్‌లో విడుదల కావాల్సిన సినిమాలను రీషెడ్యూల్ చేశారు. హాయ్ నాన్న డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు వెల్లడించాడు. అయితే ‘సలార్’ రిలీజ్ వల్లే ‘హాయ్ నాన్న’ ముందుగానే విడుదలచేస్తున్నారా అన్న క్వశ్చన్ కి అదిరిపోయే ఆన్సరిచ్చాడు నాని. ఒక కుటుంబంలో పెద్ద అన్నకు సంబంధించిన ఫంక్షన్ జరిగితే.. చిన్న వాళ్లవి వాయిదా వేస్తారు కదా.. అందుకే మా సినీ కుటుంబంలోని పెద్దవాళ్లను గౌరవిస్తూ వెనక్కి వచ్చాం అని తెలివిగా ఆన్సరిచ్చాడు నాని. ప్రభాస్ ను పెద్దన్న అని గౌరవించడంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ – నాని సమయస్ఫూర్తికి నాని ఫ్యాన్స్ ఇద్దరూ హ్యాపీగా ఫీలవుతున్నారు.

ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్నీ గమనిస్తుంటే నాని…అటు నాన్నగా, లవర్‌గా అదరగొట్టేసినట్టుగా కనిపిస్తోంది. కూతురు ప్రేమకు, అమ్మాయి ప్రేమకు మధ్యలో సాగే కథే ఈ హాయ్ నాన్న అని అర్థమైపోతోంది. ఇక నాని, మృణాళ్ లిప్ లాక్స్ టీజర్‌కి హైలెట్ అయ్యాయి. ఈ మూవీ నుంచి విడుదల చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి. అయితే డిసెంబరు 7న విడుదల కానున్న ఈ మూవీ ఎలా ఉండబోతోందో అనే చర్చ జరుగుతోంది. నాని మార్క్ ఉన్న దసరా వసూళ్లను బీట్ చేయడం అంత ఈజీ కాదని అంటున్నారు. అయితే ఈ రెండు మూవీస్ బ్యాక్ డ్రాప్ వేర్వరు కావడంతో సూపర్ హిట్ కావడం పక్కా అని ఫిక్సైపోయారు. మరి హాయ్ నాన్న రిజల్ట్ ఎల్ ఉంటుందో చూడాలి.