హరీష్ గేమ్ మొదలు – బీఆర్ఎస్ పనైపపోయినట్లేనా ?

ఒకే ఒక్క భేటీ బీఆర్ఎస్ ను కుదుపునకు గురి చేసింది. నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంతో తో సమావేశం వెనుక హరీష్ రావు ప్లాన్ ఉందని బయటకు రావడమే దీనికి కారణం. మెదక్‌కు చెందిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. గులాబీ బాస్ కేసీఆర్‌కు తెలియకుండా ఇప్పటిదాకా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు ఎవరైనా ఒక్క అడుగు కూడా వేయని కట్టుదిట్ట పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అధినేతకు తెలియకుండా ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలిసే ధైర్యం చేశారా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.

హరీష్ రావు హెచ్చరిక సిగ్నల్

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇటీవల జరగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెల్చుకుంది. ఆందోల్, మెదక్ తప్ప అన్ని సెగ్మెంట్లలనూ బీఆర్ఎస్ గెలిచింది. ఆ జిల్లా పూర్తిగా హరీష్ రావు అధీనంలో ఉంటుంది. అలాంటి జిల్లాలో ఎవరికీ తెలియకుండా నలుగురు ఎమ్మెల్యేలు వెళ్లి ముఖ్యమంత్రితో సమావేశం కావడం అనేది జరగదు. పార్టీలో ముఖ్య నేతలతో ఎంతో కొంత సమాచారం ఉండే ఉంటుంది. హరీష్ రావుకు పూర్తిగా తెలుసని.. ఆయనకు తెలియకుండా ఆ భేటీ జరగని చెబుతున్నారు. ఇది కూడా బీఆర్ఎస్‌లో అలజడి రేగడానికి మరో కారణం అయింది.

కేసీఆర్ నిర్ణయాలపై హరీష్ ఆగ్రహం

మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిపై ముఖ్య నేతలు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. కేసీఆ మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని మెదక్ పార్లమెంటు బీఆరెస్‌ అభ్యర్థిగా పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ రావును పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలని సూచించారట. ఈ ప్రతిపాదనలు హరీష్ రావుకు నచ్చలేదని చెబుతున్నారు. మెదక్ లోక్‌సభ బరిలో వెంకట్రామ్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అటున్నారు. తనను రాష్ట్ర రాజకీయాల నుంచి క్రమంగా కనుమరుగు చేసేందుకే కేసీఆర్ తన పేరును ఎంపీగా పరిశీలిస్తున్నారన్న అసంతృప్తి ఒకవైపు, తన పరిధిలోని మెదక్‌లో తన ప్రమేయం లేకుండా అభ్యర్థి ఎంపిక కసరత్తు చేయడం మరొకవైపు హరీశ్‌రావు కేసీఆర్‌కు మరో చాయిస్ లేకుండా చేసేందుకే ఇలా ఎమ్మెల్యేలను మర్యాదపూర్వక భేటీ పేరుతో రేవంత్ రెడ్డి వద్దకు పంపారని అంటున్నారు.

కేటీఆర్ డామినేషన్ తగ్గించేందుకు స్కెచ్

కేటీఆర్, హరీశ్‌రావు మధ్య విబేధాలు గతం నుండే కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ ఓ రూమర్ ఉంది. హరీశ్‌రావకు తెలియకుండా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసే సాహసం చేయరనేది రాజకీయంగా అందరికీ తెలిసిన విషయమేనని అంటున్నారు. ఎమ్మెల్యేలు ఎంతగా కవర్ చేసుకుంటున్నప్పటికీ రాజకీయంగా జరుగాల్సిన నష్టం పార్టీకి, అధినేత కేసీఆర్‌కు జరిగినట్లేనని భావిస్తున్నారు. మొత్తంగా హరీష్‌ స్కెచ్ తో బీఆర్ఎస్ అల్లాడిపోతోంది.