రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 మినహా ఆ రేంజ్ లో సక్సెస్ అయిన సినిమా లేదనే చెప్పాలి. సైరా నరసింహారెడ్డి లో నటించినా ఆ మూవీ కమర్షియల్ గా అంత సక్సెస్ కాలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య కూడా సోసోగా నడిచాయ్. ఇప్పుడు మెగాభిమానుల ఆశలన్నీ విశ్వంభర మీదే ఉన్నాయి…
ఖైదీ నంబర్ 150, సైరా మినహా..మిగిలిన సినిమాలన్నింటిలో చిరు క్యారెక్టర్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. పైగా చెప్పుకోదగిన స్థాయిలో హిట్ కూడా లేదు. అందుకు మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు విశ్వంభరపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాను యువ దర్శకుడు వశిష్ట డైరెక్ట్ చేస్తున్నారు. ‘బింబిసార’ సినిమాతో తన ప్రతిభ చూపించిన వశిష్ట రెండో ఛాన్సే చిరు మూవీ అందుకున్నాడు . ఇక మెగాస్టార్ కూడా రొటీన్ రోల్స్ క్ చెక్ పెట్టేలా విశ్వంభర సినిమాలో మరోసారి తన విశ్వరూపం చూపించాలని ఫిక్స్ అయ్యారు. రొటీన్ కామెడీ, రొటీన్ డ్యాన్స్ కాకుండా సరికొత్త కథతో తన 156వ సినిమా ఉండాలని ఫిక్స్ చేసుకున్నారు . అందుకే విజువల్ వండర్ గా మెగా ఫ్యాన్స్ తో పాటుగా మిగతా ఆడియన్స్ కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు.
బాడీ డబుల్ వినియోగించడం లేదు
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే చిరంజీవి ఈ షూటింగ్ షెడ్యూల్ కోసం బాడీ డబుల్ ను వాడటం లేదట. యాక్షన్ సన్నివేశాలలో కూడా ఆయన స్వయంగా షూట్లో పాల్గొంటున్నారట. మట్టిలో, నీళ్లలో కూడా జరిగే ఒక ఫైట్ సీన్ మొత్తం చిరంజీవి డూప్ లేకుండా చేస్తున్నారు. చిరంజీవి తో పాటు మిగతా ఫైటర్లు కూడా బురదలో మునిగి షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు. ఇక సీన్స్ రియలిస్టిక్ గా రావడం కోసం చిత్ర బృందం నిజంగానే అక్కడ ఒరిజినల్ తడి మట్టి, ఇసుకను వాడినట్లు వినికిడి. ఇక ఈ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని ఇదే సినిమాకి హైలైట్ కాబోతున్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
2025 సంక్రాంతి బరిలో
యువీ క్రియేషన్స్ బ్యానర్ లో 150 నుంచి 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన అప్ డేట్ ఏంటంటే..ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం ప్రస్తుతం ఓ భారీ సెట్ వేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సెట్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తారట. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 10, 2025న విడుదల కాబోతుంది. మరి మెగా ఫ్యాన్స్ అంచనాలు నెరవేరుతాయా లేదో చూద్దాం…