అనంతపురం, గుంతకల్లు టీడీపీలో అసంతృప్తి చిచ్చు – పలు సీట్లలో ఓట్ల చీలిక ఖాయమేనా ?

టిక్కెట్టు ఆశించిన భంగపడిన అనంతపురం, గుంతకల్లు టిడిపి నేతలు అసమ్మతిరాగం వినిపిస్తూనే ఉన్నారు. టిడిపి తుది జాబితా విడుదల చేసినప్పటి నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లోనూ మాజీ ఎమ్మెల్యేల అనుయాయులు ఆగ్రహావేశాలు ప్రదర్శిస్తూనే ఉన్నారు. టిడిపి కార్యాలయాలను ధ్వంసం చేశారు. అటోఇటో తేల్చకుంటామంటూ సవాళ్లు విసిరారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు రెండు నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమావేశాలు సైతం నిర్వహించారు.

రెబల్‌గా ప్రభాకర్ చౌదరి

అనంతపురం నగరంలోని కమ్మ భవనంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆత్మీయ సమావేశం పేరుతో నిర్వహించిన ఈ సమావేశం కాస్త బలప్రదర్శనలాగానే సాగింది. పెద్దఎత్తునే ఆయన అనుయాయులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రభాకర్‌ చౌదరి ఒక స్పష్టతనిచ్చారు. తాను పార్టీ వీడబోనని చెప్పారు. అయితే ఏమి చేయాలన్నది అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. టిడిపి అభ్యర్థి విషయంలో పునరాలోచించాలని ఆయన అనుయాయులు మరికొంత మంది డిమాండ్‌ చేశారు. అయితే ప్రభాకర్‌ చౌదరి రెబల్‌గా పోటీ చేయాలన్న అంచనాకు వచ్చిటన్లుగా చెబుతు్ననారు.

ఇండిపెండెంట్ గా జితేందర్ గౌడ్

ఇదే తరహాలో గుంతకల్లులోనూ మాజీ ఎమ్మెల్యే జితేందర్‌ గౌడ్‌ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనూ ఆయన కూడా పార్టీని వీడబోనని చెప్పడం గమనార్హం. అయితే తటస్థ వైఖరిని కొంత కాలం తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అనుయాయులతో వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు అవుట్‌ జిల్లాలో ఇప్పటికే ఇద్దరు పార్టీని వీడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జి మాదినేని ఉమామహేశ్వరనాయుడు ముఖ్యమంత్రి సమక్షంలో శనివారం నాడు వైసిపిలో చేరారు. ఇది మరువక ముందే టిడిపికి మరో షాక్‌ తగులుతోంది. మాజీ ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా టిడిపికి రాజీనామ చేశారు. సోమవారం నాడు ముఖ్యమంత్రి సమక్షంలో ఆయన వైసిపిలో చేరనున్నారు

వైసీపీలో చేరుతున్న పలువురు నేతలు

ఇద్దరు మాజీలు అసంతృప్తితో ఉండగా, మరో ఇద్దరు నాయకులు ఏకంగా పార్టీనే మారారు. ఎన్నికల సమయానికి టిడిపిలో ఇంకెన్ని మార్పులు చేర్పులు జరగనున్నాయో… ధర్మవరం కమలంలోనూ ఆగని అసమ్మతి ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ అభ్యర్థి అని మొదట అనుకున్నారు. ఆయన ప్రచారమూ ప్రారంభించారు. అయితే చివరి నిమిషంలో ఆయన కాకుండా సత్యకుమార్‌కు కేటాయించారు. దీంతో జి.సూర్యనారాయణ అసంతృప్తితో ఉన్నారు. ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారన్న ప్రచారమూ నడుస్తోంది.