తిరుమల కాలిబాటలో భక్తులు పూర్తిగా తగ్గిపోయారు. అనవసర భయాలను పెంచడంతో అసలు భక్తులు కాలినడకన వెళ్లడం లేదు. దీంతో ఇదంతా టీటీడీ, ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్ర అనే ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుటోంది. కర్రలు ఇస్తున్నా… భద్రతకు టీటీడీ భరోసా ఇవ్వకపోవడంతో సమస్యలు వస్తున్నాయి.
శ్రీవారి మెట్లు పురాతనమైన నడకదారి
శ్రీవారిని నడకదారిలో దర్శించుకోవడం ఇప్పటిదా ? శతాబ్దాలుగా భక్తులు అదే విధంగా శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడక మార్గం ఎంతో విశిష్టం. కాలి నడక మార్గానికి ఎంతో చరిత్ర ఉంది. శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గము శ్రీవారి మెట్లు అని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు. తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి. శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదీతర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని చదువుున్నాం .
ఎప్పుడూ లేనంత వన్యమృగాల భయం ఇప్పుడే ఎందుకు ?
అప్పట్లో వన్యమృగాల బాధ లేదా అంటే… ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. మరి ఇప్పుడే ఎందుకు సమస్య వస్తోంది ?. అదే అసలైన లాజిక్. ఇప్పుడు తిరుమల నడక దారులు చూస్తే ఏ శ్రీవారి భక్తుడికైనా ఆవేదన కలుగుతుంది. ఒకప్పుడు లక్షల్లో భక్తులు ఏడుకొండల వాడిని దర్శించుకునేవారు. ఇలా కాలినడకన వెళ్లే వాళ్లల్లో పేద, మధ్యతరగతి, ధనవంతులు, సెలబ్రిటీలు కూడా కాలి నడకన వెళ్తూ శ్రీనివాసుని మొక్కులు తీర్చుకునేవారు. అందుకే కాలిబాట ఎప్పుడూ నిత్యం రద్దీగా ఉంటూ..గోవింద నామ స్మరణలతో మారుమ్రోగేది. అలాంటి మార్గం బోసిపోవటం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. శతాబ్దాలుగా లేని వన్యమృగాల దాడులు ఇప్పుడే ఎందుకు ఎక్కువయ్యాయన్నది చాలా మందికి తెలియని విషయమే.
భక్తులకు ధైర్యం చెప్పకుండా .. ఎందుకు భయపెడుతున్నారు ?
ఇటీవల బోన్లు పెట్టి.. అదిగో ఎలుగుబంటి.. ఇదిగో చిరుత అని భయపెట్టడం కామన్ అయిపోయింది . భక్తులు మళ్లీకాస్త పెరుగుతున్నారన్నప్పుడు… ఓ పులి వీడియో విడుదల అవుతోంది. ఇలా ఎందుకు జరుగుతుందో మరి. భక్తులకు కర్రలిస్తాం… భద్రత ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు. . కానీ భక్తులకు ధైర్యం మాత్రం అందించలేకపోతున్నారు. ఫలితంగా భక్తుల రాక.. నడకదారి నుంచి తగ్గిపోతోంది.