ఆన్ లైన్ బెట్టింగ్ రాకెట్ లో ఛత్తీస్ గఢ్ సీఎం కార్యాలయం

కాంగ్రెస్ పాలిత ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కుప్పలు తెప్పలుగా స్కాంలు బయటకు వస్తున్నాయి. అధికార పార్టీలో ఉన్న వారు, అధికార కేంద్రానికి దగ్గర ఉండే బ్యూరోక్రాట్లు ఎవరి గురించి తెలుసుకోవాలనుకున్నా ఒక స్కాం చేసినట్లుగా బయట పడుతోంది. పార్టీ పాలనా కాలం పూర్తయి ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మళ్లీ అవకాశం వస్తుందో రాదో నాలుగు రాళ్లు వెనకేసుకుందామనుకునే వాళ్లంతా స్కాములకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అందులో కొందరు కేంద్ర దర్యాప్తు సంస్థలకు చిక్కి ఊచలు లెక్కబెడుతున్నారు.

భాగేల్ స్టాఫ్ పై ఈడీ నజర్

ఆన్ లైన్ బెట్టింగ్ స్కాంలో మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడి విచారణ వేగవంతమైంది. ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ, సీఎం కార్యాలయ ఓఎస్డీ మనీష్ బాంచోర్ ను ఈడీ సోమవారం ప్రశ్నించింది. మరో అధికారి అశీష్ వర్మకు సమన్లు వెళ్లాయి. ఇటీవల అరెస్టయిన ఒక వ్యక్తి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే వారిద్దరినీ ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి. ఆన్ లైన్ బెట్టింగు ముఠాలు, బ్యూరోక్రాట్లకు ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించినందునే రాజకీయ సలహాదారుని, ఓఎస్డీని ప్రశ్నించినట్లు ఈడీ చెబుతోంది.

గేమింగ్ యాప్ లోనే అసలు రహస్యం

మహదేవ్ యాప్ ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ జరిగి వందల కోట్లు చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. ఆగస్టు 23న అనేక చోట్ల జరిపిన రైడ్ల కారణంగా విస్తు పోయే అంశాలు బయటకు వచ్చాయి. అందుకే వర్మతో పాటు ఇద్దరు ఓఎస్డీల నివాసాలు, కార్యాలయాలపై దాడులు చేయాల్సి వచ్చిందని ఈడీ అధికారులు అంటున్నారు. అక్రమంగా నిర్వహించే గేమింగ్ యాప్ ను రాష్ట్రంలో అనుమతించినందుకు ఛత్తీస్ గఢ్ ఉన్నత స్థాయి అధికారులకు ముడుపులు అందాయని నమ్ముతున్నారు. ఈ క్రమంలో హవాలా వ్యాపారులు అనిల్ దమానీ, సునీల్ దమానీలను ఈడీ అరెస్టు చేసింది.దుబాయ్ కి చెందిన సౌరభ్ చంద్రార్కర్ అనే వ్యక్తి పేరుతో మహదేవ్ యాప్ ఉందని ఈడీ గుర్తించింది. అతని అనుచరులకు ఛత్తీస్ గఢ్ లో పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాయ్ పూర్, భిలాయ్, దుర్గ్ ప్రాంతాల్లో యువకులు ఈ యాప్ ద్వారా క్రికెట్ సహా పలు గేమ్స్ లో ఆన్ లైన్ బెట్టింగ్ పెట్టి సర్వనాశనమయ్యారు.

శ్రీలంకలో పట్టుబడింది ఎవరూ ?

యాప్ నిర్వాహకుడు సౌరభ్ చంద్రార్కర్ తో పాటు అతని సన్నిహితులు రవి ఉత్పల్ ను శ్రీలంకలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఇంటర్ పోల్ నోటీసుతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారని, త్వరలో భారత్ కు రప్పిస్తారని ఈడీ వర్గాలు అంటున్నాయి. అతను అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. దానితో ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములకు, అండర్ వరల్డ్ కు లింకులపై కూడా దర్యాప్తు జరగాల్సి ఉంటుం