తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలు – విభజన చట్టం రద్దు చేయించగలరా ?

కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కు ప్రాజెక్టులను అప్పగించిన వ్వవహారంపై తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పగిస్తోందనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. తాము అప్పగించే ప్రశ్నే లేదని.. గతంలోనే అప్పగిస్తూ సంతకాలు చేశారని కాంగ్రెస్ వాదిస్తోంది. దీనిపై అసెంబ్లీలో వాడివేడి చర్చ. ఇందులోనే తాము ప్రాజెక్టులు అప్పగించబోమని తీర్మానం చేసింది కాంగ్రెస్.. బీఆర్ఎస్ సమర్థించింది.

అసలు కేంద్రానికేం సంబంధం

పార్టీలు కలిసి పరస్పర యుద్ధం చేసుకుంటున్నట్లుగా షో చేసి.. కేంద్రంపై నిందలేససేందుకు ప్రయత్నిస్తున్నాయి. అసెంబ్లీ యుద్ధం చూస్తే తెలంగాణలో రాజకీయం అంతా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జరుగుతోందని అనిపించేందుకుు ప్రయత్నించాయి. తెలంగాణలో బీఆర్ఎస్ , కాంగ్రెస్ మధ్యే ఏదో పోరాటం నడుస్తోందని.. రెండు పార్టీల మధ్యే యుద్ధం జరుగుతోందని అనిపించడానికి.. కృష్ణా ప్రాజెక్టుల పేరుతో రాజకీయం చేస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. అసలు లేని వివాదాన్ని తెరపైకి తెచ్చి సభలు.. సమావేశాలు పెట్టుకుంటున్నారని.. ఇదంతా లోక్ సభ ఎన్నికల రాజకీయం అని గట్టిగా నమ్ముతున్నారు.

విభజన చట్టం రద్దు చేయమని డిమాండ్ చేయగలరా ?

కృష్ణా ప్రాజెక్టుల్ని తాము కాపాడుతున్నామంటే.. తాము కాపాడుతున్నామని బీఆర్ఎస్, కాంగ్రెస్ అసెంబ్లీ వేదికగా వాదించుకుటంున్నాయి. నిజానికి విభజన చట్టం పాస్ అయినప్పుడే కేంద్రం అధీనంలోకి ప్రాజెక్టులు వెళ్లాయి. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అప్పుడు కృష్ణా ప్రాజెక్టులపై KRMB అజమాయిషీ మొదటి నుంచి ుంది. ఎవరికి ఎపప్పుడు ఎంత నీళ్లు కావాలో కేఆర్ఎంబీనే నిర్ణయిస్తోంది. బోర్జు సమావేశం ఏర్పాటు చేసి.. ఒప్పందాల మేరకు నీళ్లుకేటాయిస్తోంది. పదేళ్లలో కేఆర్ఎంబీ రెండు రాష్ట్రాల అనుమతులతోనే కదా నీళ్లు ఇస్తోంది. ఇప్పుడు కొత్తగా అధీనంలోకి తీసుకోవడం అంటే.. భద్రతను చేపట్టడం. అసలు ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే విభజన చట్టాన్ని రద్దు చేయించాలి. దీనికి రెండు పార్టీలు ఒప్పుకుంటాయా ?

తోడు దొంగల రాజకీయాలు

అంతిమంగా నువు కొట్టినట్లుగా నటించు.. నేను ఏడ్చినట్లుగా జీవిస్తానని.. రెండు పార్టీలు ఎవరూ ఊహించని రాజకీయం చేశాయి. ఇంత కాలం.. బీజేపీతో ఆ పార్టీ సన్నిహితం.. ఈ పార్టీ సన్నిహితం అని చెప్పి.. ప్రజలను తప్పుదోవ పట్టించారని.. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే యుద్ధం చేస్తున్న భావన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ నేతలంటున్నారు.