ఉజ్వల్ నికమ్ కు బీజేపీ టికెట్

సమర్థలు, సేవా భావంతో పనిచేసేవారు, సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టేవారు రాజకీయాల్లోకి రావాలని బీజేపీ నిత్యం ఆకాంక్షిస్తూనే ఉంటుంది. సమర్థంగా పనిచేసే కొత్తవారికి అవకాశమిచ్చేందుకు కమలం పార్టీ వెనుకాడదు. ఇందుకోసం అవసరమైతే పాత వారిని కొంతకాలం ఆపి, తర్వాతి కాలంలో వేరొక మార్గాన వారిని అకామడేట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా అదే క్రమంలో కొంతమందిని ఎన్నికల రాజకీయాల్లోకి దించింది….

పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వరల్డ్ ఫేమస్ ….

ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ కొత్త అభ్యర్థిని రంగంలోకి దించింది. ఆయనే మహారాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ .వరుసగా రెండు సార్లు గెలిచిన పూనమ్ మహాజన్ కు ఈ సారి టికెట్ ఇవ్వలేదు. ఆమె దివంగత ప్రమోద్ మహాజన్ కూతురు. ఐనా సరే ఆమెను ఈ సారి ఆపి..ఉజ్వల్ నికమ్ కు అవకాశం ఇవ్వాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ సిటీ చీఫ్ వర్షా గాయక్వాడ్ పై ఆయన పోటీ చేస్తున్నారు. వర్షా ఇప్పుడు ధారవి ఎమ్మెల్యేగా ఉన్నారు…ఇక కీలక కేసుల్లో ఉజ్వల్ నికమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు..

30 ఏళ్ల పాటు సేవలు..

మహారాష్ట్రలోని జలగాం జిల్లాలో పుట్టిన ఉజ్వల్ .. న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన తర్వాత తిరుగులేని న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. 30 ఏళ్ల పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేశారు. ప్రముఖుల హత్యలు, ఉగ్రవాద కేసుల్లో ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు. 1993 బాంబే బాంబు పేలుళ్లు , గుల్షన్ కుమార్ హత్య కేసు, ప్రమోద్ మహాజన్ హత్య కేసు , 2008 ముంబై దాడులలో నిందితులను విచారించడంలో ఉజ్వల్ …దర్యాప్తు సంస్థలకు సాయపడ్డారు. 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు , 2016 కోపర్డి రేప్ అండ్ మర్డర్ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పనిచేశారు. ఉజ్వల్ నికమ్ 26/11 ముంబై దాడి విచారణ సందర్భంగా రాష్ట్రం తరపున వాదించారు. ఆయన వాదనలు వినేందుకు సామాన్య జనం కూడా తండోపదండాలుగా తరలి వచ్చేవారని చెబుతారు. పైగా తన వాదనలకు సంబంధించిన సారాంశాన్ని నిత్యం టీవీ కెమెరాల ముందు చెబుతూ ఆయన నిందితులు చేసిన తప్పులను సామాన్య ప్రజలకు సైతం తెలిసే విధంగా వ్యవహరించేవారు.

పద్మశ్రీతో గౌరవించిన సర్కారు…

ఉజ్వల్ నికమ్ అంటే ప్రభుత్వ, ప్రతిపక్ష పెద్దలకు అభిమానమే.. కేంద్రప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం అందజేసింది. ఆయన జీవిత కథ ఆధారంగా ఆదేశ్ -పవన్ ఆఫ్ లా సినిమాను రూపొందించారు. మచ్చలేని న్యాయవాదిగా పేరున్న ఉజ్వల్ నికమ్ కు ముంబై నార్త్ సెంట్రల్ టికెట్ ఇవ్వడం ద్వారా బీజేపీ ఆయన సేవలను గుర్తించినట్లయ్యింది..