జనసేన, బిజెపితో టిడిపికి పొత్తు ఏళ్ల తరబడి పార్టీలో సీనియర్లుగా ఉండి, టిక్కెట్ ఆశించి, ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంపై తిరగబడిన వారిని నిరాశ పరచింది. తిరుపతి మాజీ ఎంఎల్‌ఎ ఎం.సుగుణమ్మ పరిస్థితికి భిన్నంగా ఏమీ లేదు మాజీ మంత్రి పనబాక లక్ష్మి కూడా. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట ముంచేశాడని పనబాక దంపతులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
చంద్రబాబు ఒత్తిడితో తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేసిన పనబాక
పనబాక లక్ష్మి తిరుపతి ఉపఎన్నికల్లో పోటీ చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నికల బరిలో దిగితే ఓటమి తప్పదని తెలిసిన అధిష్టానం మాట ధిక్కరించలేదన్న విషయాన్ని వారు అనుచరగణంతో చెప్పుకుని బాధపడుతున్నారు. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పనబాక కుటుంబం ఓ వెలుగు వెలిగింది.. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనభాక లక్ష్మి కేంద్రమంత్రిగా పనిచేశారు. ఆమె భర్త పనబాక కష్ణయ్య గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో అభివద్ధి కార్యక్రమాలు చేశారు..
టీడీపీలో చేరిన తర్వాత పనబాకకు గడ్డు పరిస్థితి
తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వారి ప్రతిష్ట మసకబారిందని ఆమె అనుచరులు చెబుతున్నారు.. టిడిపిలో రెండు సీట్లు ఇస్తానని చంద్రబాబు మాటిచ్చారట.. అయితే బిజెపితో పొత్తులో భాగంగా ఒక్క సీటు కూడా ఇవ్వకపోవడంతో పనబాక దంపతులు చంద్రబాబుపై కన్నెర్ర చేస్తున్నారట.. 1991లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పనబాక లక్ష్మి.. నెల్లూరు పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు ఆమె.. కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న పనబాక దంపతులు.. 2014లో జరిగిన రాజకీయ పరిణామాల అనంతరం 2021 లో తెలుగుదేశం పార్టీలో చేరారు..అప్పట్నుంచి పార్టీ బలోపేతానికి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు..
ఎక్కడా అవకాశం కల్పించని చంద్రబాబు
అయితే సుళ్లురుపేట అసెంబ్లీ టికెట్ తో పాటు తిరుపతి ఎంపి టికెట్లు ఇస్తానని చంద్రబాబు పనబాక దంపతులకు మాటిచ్చారట.. చివరిదాకా ఎదురుచూసిన రెండు స్థానాలు దక్కకపోవడం పై పనబాక కుటుంబం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర అసంతప్తితో ఉన్నారట.. ఇతర పార్టీల్లోనూ దారులు మూసుకుపోవడంతో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందని పనబాక లక్ష్మీ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట ముంచేసాడని తీవ్ర అసంతప్తి వ్యక్తం చేస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది.