బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ రద్దు చేస్తామని అమిత్ షా అన్నట్లుగా ఫేక్ చేసిన వీడియోతో కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోయింది. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేయాలనుకుంది. కానీ అలాంటి ప్రయత్నం చేసి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి నిండా మునిగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేటలో చేసిన ప్రసంగాన్ని కాంగ్రెస్ మార్ఫింగ్ చేయించిన రేవంత్ అరెస్ట్ ముప్పును ఎదుర్కొంటున్నారు.
బీజేపీకి కొన్ని వర్గాలను దూరం చేసే కుట్ర
అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేయడం ద్వారా కొన్ని వర్గాలను భయభ్రాంతులను చేసేందుకు, కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంది. అవినీతి విషయంలో ప్రధాని మోదీని తప్పు పట్టే అవకాశం లేకుండా పోయింది.. అందుకే బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దుచేస్తుందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారానికి తెరలేపిందన్న ఆరోపణలు గుట్టిగా వినిపిస్తోంది. బీజేపీని ఎదుర్కొనే దమ్ము లేక ఎస్సీ, ఎస్టీల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడానికి కుట్ర చేస్తోందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ వస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండం
కాంగ్రెస్ మతపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తోంది. సుప్రీం కోర్టు వద్దన్న మతపరమైన రిజర్వేషన్లు తెచ్చి కాంగ్రెస్ పేదల పొట్ట కొట్టింది. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్లను రద్దు చేసి పేదలకు పంచుతామని చెబుతోంది. కానీ కాంగ్రెస్ ముస్లింలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తోంది. వారికి రిజర్వేషన్లు పెంచుతామని అంటోంది. వారికి రిజర్వేషన్లు పెంచాలంటే ఎవరికి కోత వేయాలి.. ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకే. అక్కడే అసలు కుట్ర కనిపిస్తోంది.
బీజేపీ వస్తేనే రిజర్వేషన్లు, రాజ్యాంగానికి భద్రత
మన రాజ్యాంగాన్ని ్అత్యధిక సార్లు సవరించింది కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు ఓట్లు వేస్తారని చెప్పి ముస్లింలకే ప్రాధాన్యత ఇస్తోంది. మేనిఫెస్టోలో ఆస్తుల్ని పంచుతామని పరోక్షంగా చెప్పింది అందే. కానీ రివర్స్ లో ప్రచారం చేస్తూ ఓట్లు దండుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్ ట్రాప్ లో ప్రజలు పడబోరని.. వారికి బుద్ది చెబుతారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి