2024 ఆరంభంలో అంతగా చెప్పుకునే సినిమాలేవీ రాలేదు. సమ్మర్లో అయినా గట్టిగా ఉంటుందనుకుంటే సగం సమ్మర్ గడిచిపోయింది. అయితే సెకెండాఫ్ మాత్రం దుమ్ముదులిపేందుకు సిద్ధమవుతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు.. నెలకో మూవీ చొప్పున థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైపోతున్నాయ్. ఇవన్నీ పాన్ ఇండియా మూవీస్ కావడం మరింత ఇంట్రెస్టింగ్…
జూన్ లో ప్రభాస్
జూన్ లో కల్కితో ఈ ఏడాది పాన్ ఇండియా బిగ్గెస్ట్ మూవీస్ సందడి మొదలవుతోంది. కల్కి 2898ఏడీ మూవీ జూన్ 27న విడుదలవుతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో అత్యధిక స్క్రీన్స్ లో ఏకంగా 22 భాషలలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
జూలైలో బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో చేస్తోన్న సినిమా జులైలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తునానరు. బాలయ్య కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఆగష్టులో అల్లు అర్జున్
ఆగష్టులో మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. ఈ మూవీలో ఐకాన్ స్టార్ రేంజ్ మరింత పెరగడం పక్కా. ఆగష్టు 15న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది.
సెప్టెంబర్లో పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సుజిత్ కాంబినేషన్లో వస్తోన్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఓజీ సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఎలక్షన్ హడావుడిలో ఉన్న పవన్ కళ్యాణ్..ఎన్నికలు ముగిసిన వెంటనే మూవీపై కాన్సన్ ట్రేట్ చేయనున్నాడు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న పవన్ ఫస్ట్ మూవీ ఓజీనే…
అక్టోబర్ లో యంగ్ టైగర్
అక్టోబర్ 10న దసరా కానుకగా ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ దేవర రిలీజ్ కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టందుకుంటాం అని ఫిక్సైపోయారు మూవీ యూనిట్. ఈ మూవీతో జాన్వికపూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతోంది..
నవంబర్ లో రామ్ చరణ్
రామ్ చరణ్-శంకర్ కాంబోలో రూపొందుతన్న గేమ్ ఛేంజర్ మూవీ నవంబర్ లేదా డిసెంబర్లో రిలీజ్ కానుందని టాక్. ఈ మూవీపై కూడా భారీ అంచనాలున్నాయి.
ఇక 2025 ఆరంభంలో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, ప్రభాస్ రాజాసాబ్ సినిమాలు రిలీజ్ కానున్నాయని టాక్…మొత్తానికి 2024 ఆరంభం కన్నా సెకెండాఫ్ అదుర్స్ అన్నమాట. ఈ మూవీస్ అన్నీ సక్సెస్ అయితే టాలీవుడ్ రేంజ్ మరింత పెరగిపోతుంది…