పవన్ వీరాభిమాని సినిమాలో భైరవకోన బ్యూటీ!

నితిన్ హీరోగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడంతో పాటూ నితిన్ పవన్ కి వీరాభికావడంతో ఈ మూవీపై అందరి కాన్సన్ ట్రేషన్ పడింది. ఈ మూవీ అప్ డేట్స్ ఏంటంటే…

కాంతారా పిల్ల కాదు భైరవకోన బ్యూటీ
‘తమ్ముడు’ అనే టైటిల్ పెట్టి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో హీరోయిన్ గా కాంతారా బ్యూటీ సప్తమీ గౌడ నటిస్తుందనే వార్తలొచ్చాయి. అయితే సప్తమీ కాదు..వర్ష బొల్లమ్మ నటిస్తుందంటున్నారు. మరి సప్తమీ గౌడతో పాటూ బొల్లమ్మ ఉంటుందా లేదంటే సప్తమి ప్లేస్ లో వర్ష వచ్చిందా అనేది క్లారిటీ లేదు. ఈ మూవీలో హీరోయిన్ లయ నితిన్ కి అక్కగా నటిస్తోంది. అందుకే తమ్ముడు అనే టైటిల్ పెట్టారట. లయకు రీ ఎంట్రీ మూవీ కూడా ఇదే…అక్క తమ్ముడు సెంటిమెంట్ చుట్టూ కథ నడుస్తుందని టాక్.

తమ్ముడితో మరో హిట్
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఫ్లాప్ అయిన తర్వాత నితిన్ ‘తమ్ముడు’పై కాన్సట్రేషన్ చేస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమాతో పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. రూ.8 కోట్లతో ఓ హై-ఆక్టేన్ ఫైట్ సీక్వెన్స్‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ సంగీత దర్శకుడు. పవన్ కళ్యాణ్ మూవీ టైటిల్, పవన్ డైరెక్టర్ , పవన్ అభిమాని…అంతా పవన్ మయం…ఈ సినిమాతో సక్సెస్ పక్కా అని ఫిక్సైపోయాడు నితిన్….

జోరు పెంచిన వర్ష బొల్లమ్మ
2019లో ‘చూసి చూడంగానే’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస ఆఫర్స్ దక్కించుకుంది కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పే క్యారెక్టర్ రాలేదు. రీసెంట్ గా సందీప్ కిషన్ తో కలిసి ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో నటించింది. నటన , అందంలో వర్ష బొల్లమ్మకి ఫుల్ మార్కులు. ఇప్పుడు నితిన్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఈ సినిమా హిట్టైతే వర్షకు ఆఫర్స్ పెరిగే ఛాన్స్ ఉంది…