చాలామందిని వేధిస్తోన్న ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. మారుతున్న జీవన శైలి, వాతావరణ కాలుష్యం, జన్యు సంబంధిత లోపాలు కారణంగా క్యాన్సర్ ముప్పు పొంచి ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో పాటూ నిత్యం ఇంట్లో వినియోగించే వస్తువులు, గృహోపకరణాలు కూడా క్యాన్సర్ కారకాలే అని హెచ్చరిస్తున్నారు…అలాంటి కొన్ని మీకోసం…
నాన్ స్టిక్ వంటపాత్రలు
వంట త్వరగా అవ్వాలనే ఉద్దేశంతో చాలామంది నాన్ స్టిక్ కుక్ వేర్స్ వినియోగిస్తున్నారు. వాస్తవానికి నాన్ స్టిక్ పెనం, కడాయి వంటివి స్టౌమీద వేడి చేస్తున్నప్పుడు హానికరమైన పెర్ ఫ్లోరినేటెడ్ అనే కెమికల్స్‌ను రిలీజ్ చేస్తాయి. ఇవి మనం తినే ఆహారాల్లో కలిసిపోయి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
ప్లాస్టిక్ కవర్లు
పండ్లు, కూరగాయలు, వివిధ ఆహార పదార్థాలు తీసుకొచ్చేందుకు, స్టోర్ చేసేందుకు ప్లాస్టిక్ కవర్లను వాడుతుంటాం. స్వీట్లు కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతుంటాం. కానీ వీటిలో ఉండే థాలేట్స్, బిస్ఫినాల్ వంటి కెమికల్స్ క్యాన్సర్ కారకం. అందుకే స్టెయిన్ లెస్ స్టీల్ కంటైనర్లు, గాజు పాత్రల వాడటం బెటర్.
క్లీనింగ్ లిక్విడ్స్
రోజూ ఇంటిని క్లీన్ చేయడానికి బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల లిక్విడ్స్ వాడుతుంటాం. వీటిలో అమ్మోనియా, క్లోరిన్ బ్లీచ్, ఫార్మాల్డీహైడ్ వంటి క్యాన్సర్ కారకారక కెమికల్స్ ఉంటాయి. అందుకే వీటికి ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడా, వెనిగర్ వంటివి వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
అందమైన పెయింటింగ్స్ తో ముప్పు
గోడలు అందంగా కనిపించాలంటూ వివిధ రకాల పెయింటింగ్స్ , వార్నిష్ లు వినియోగి్తారు. ఈ లిక్విడ్స్‌లో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే బెంజీన్, ఫార్మాల్డిహైడ్, టోల్యూన్ వంటి కెమికల్స్ మిక్స్ అయి ఉంటాయి.
క్యాండిల్స్
క్యాండిల్స్ ఎక్కువగా వినియోగించినా క్యాన్సర్ ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. క్యాండిల్స్ వెలిగించినప్పుడు టోలున్, బెంజీన్ వంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయట.
పెప్టిసైడ్స్
పంట పొలాలు, గార్డెన్‌లోని మొక్కలకు తెగుళ్లు, చీడ పీడల నివారణకు పెప్టిసైడ్స్ యూజ్ చేస్తుంటారు. వీటిలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇలాంటి కూరగాయలు తినడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి.
ఫోన్లు ఎక్కువ వినియోగించినా
దీర్ఘకాలంపాటు ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి వెలువడే రేడియేషన్స్కు గురికావడంవల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే పడుకునే ముందు సెల్ఫోన్లను, ఇయర్ బడ్స్‌ను స్విచ్ ఆఫ్ చేయడం, దూరంగా పెట్టడం వంటివి చేయాలని నిపుణులు చెప్తున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.