థైరాయిడ్ వల్ల బరువు పెరిగేవారు ఈ జాగ్రత్తలు తీసుకోండి!

డయాబెటీస్ తో పాటు థైరాయిడ్ కూడా సాధారణ వ్యాధిగా మారిపోయింది. నేటి జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా మంది థైరాయిడ్ బారిన పడుతున్నారు. ఈ సమస్య ఆడవారిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. థైరాయిడ్ అనేది మన మెడ దిగువ భాగంలో ఉండే గ్రంథి. ఇది శరీరంలో థైరాయిడ్ అనే హార్మోన్ ను నియంత్రిస్తుంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు, ఆకలి లేకపోవడం, బరువు పెరగడం, విపరీతమైన నిద్ర వంటి సమస్యలొస్తాయి. వీటి నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా అయోడిన్ తగ్గకుండా చూసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు…

అయోడిన్ ఉండే ఆహార పదార్థాలివే..

@ పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తుల్లో కూడా అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే థైరాయిడ్ సమస్యలు రావు. అలాగే వీటిలో ఉండే కాల్షియం మీ ఎముకలను బలంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

@ నోరి, కెల్ప్ వంటి సముద్ర కూరగాయలు అయోడిన్ కు మంచి వనరులు. మీరు వీటిని సూప్ గా, సలాడ్ గా మీ డైలీ డైట్ లో చేర్చుకోవచ్చు. వీటిని తినడం వల్ల థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేస్తుంది.

@ కాడ్, ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో అయోడిన్ మెండుగా ఉంటుంది. ఈ చేపలను తింటే మీకు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. అలాగే అయోడిన్ కూడా సరఫరా అవుతుంది.

@ గుడ్లలో అయోడిన్ తో పాటుగా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లలో సెలీనియం, జింక్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. గుడ్లను తింటే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది.

ఇంకా రోజువారీ ఆహారంలో మజ్జిగను తప్పని సరిగా చేర్చుకోండి. ఎందుకంటే ఈ పానీయంలో ప్రోబయోటిక్స్ ఉంటాయి..ఇవి హైపోథైరాయిడిజంలో మంటను తగ్గిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల ఇందులో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, లైకోపీన్ శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇంకా బచ్చలికూర, గరంమసాలా, కొత్తిమీర, పుదీనా ఆకులు వంటి ఆకుపచ్చ కూరగాయలతో చేసిన జ్యూస్‌లను తాగండి. పచ్చి రసంలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయి. మీరు దోసకాయ లేదా నిమ్మరసం కూడా తాగొచ్చు. ఇక అశ్వగంధ, శతావరి థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మీ రోజువారీ ఆహారంలో ఈ రెండు మూలికలతో చేసిన టీని చేర్చుకోవటం మంచిది. కావాలంటే మీరు గ్రీన్ టీ కూడా తాగవచ్చు. మందులు వినియోదిస్తూనే ఇంటి చిట్కాలు పాటిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.