సాధారణంగా ఎక్కడికెళ్లినా వెంట ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్లే అలవాటు చాలామందికి ఉంటుంది. సమ్మర్లో అయితే మరింత అవసరం కూడా. తరచూ నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ బాటిల్ నీటిగా లేకుంటే అనారోగ్యం కూడా పొంచి ఉంటుందని గుర్తించాలి. మరి బాటిల్ ని ఎలా క్లీన్ చేయాలో తెలుసా…
వేడి నీళ్లు-వెనిగర్
రెండు రోజులకోకసారి వాటర్ బాటిల్లో గోరువెచ్చని నీళ్లు, వెనిగర్ తో క్లీన్ చేయాలి. బాటిల్లో ఒక వంతు వెనిగర్ వేయండి. మిగిలిన గ్యాప్ వేడి నీరుతో నింపండి. రాత్రంతా బాటిల్ అలా వదిలేయండి. ఉదయం లేచిన తర్వాత, ఓ సారి బాటిల్ షేక్ చేయండి. దానిలోని నీరు బయటకు పారబోసి, శుభ్రమైన నీటితో కడగండి.
దాల్చిన చెక్క
సీసాలు వాసన వస్తుంటే చిన్న దాల్చిన చెక్కను సీసాలో ఉంచి కాసేపు ఎండలో ఉంచితే చాలు..దుర్వాసన పోతుంది.
ప్లాస్టిక్ బాటిల్స్ తో జాగ్రత్త
రేట్ తక్కువ కదా అని ప్లాస్టిక్ సీసాలు వినియోగిస్తే దానివల్ల హానికరమైన రసాయనాలు కడుపులోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే నాణ్యమైన బాటిల్స్ ను ఎంపిక చేసుకోవాలి. అవికూడా ఏళ్లతరబడి వినియోగించరాదు…నాలుగైదు నెలలకోసారి మార్చేయాలి…
సబ్బు – గోరువెచ్చటి నీళ్లు
రోజువారీ వాడే బాటిల్‌ను సబ్బు, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవచ్చు. మీ వాటర్ బాటిల్లో గోరు వెచ్చని నీరు పోసి దానిలో సబ్బు వేయండి. ఆ తర్వాత దాన్ని షేక్ చేయండి. ఇప్పుడు వాటర్ బాటిల్ క్లీనింగ్ బ్రష్‌తో శుభ్రం చేయండి. ఆ తర్వాత బాటిల్ లోపల ఉన్న నీరు పారబోసి. ఫ్రెష్ వాటర్‌తో ముడు, నాలుగు సార్లు వాష్ చేసి, డ్రై చేయండి. మీ దగ్గర ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ ఉంటే, దానిని వేడి నీటితో నింపి 10 నిమిషాలు అలాగే ఉంచండి. అందులో ఉండే బ్యాక్టీరియా చనిపోతుంది.
బేకింగ్ సోడా, వేడి నీళ్లు..
బేకింగ్ సోడా బాటిల్లోని బ్యాక్టీరియాను చంపుతుంది. బాటిల్లో రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా వేసి వేడినీళ్లు పోయండి. ఇప్పుడు బాటిల్ క్యాప్ పెట్టి షేక్ చేయండి. ఆ తర్వాత మూత తీసి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత, దానిలోని నీరు పారబోసి, ఫ్రెష్ వాటర్‌తో వాష్ చేయండి.
బ్లీచ్, కోల్డ్ వాటర్..
వాటర్ బాటిల్ నుంచి వచ్చే వాసనను తొలగించడానికి బ్లీచ్ కోల్డ్ వాటర్ పద్ధతి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. మీ వాటర్ బాటిల్లో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి రాత్రంతా ఉంచండి. ఉదయాన్నే ఆ నీళ్లు పారబోసి. సబ్బుతో శుభ్రం చేసి, ఫ్రెష్ వాటర్‌తో క్లీన్ చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.