బాలీవుడ్ స్టార్ డైరక్టర్ నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీ ప్రకటన చేసినప్పటి నుంచీ దీనికి సంబంధించి వచ్చిన ప్రతి అప్ డేట్ ను నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ మూవీలో నటిస్తున్నవారంతా స్పెషల్ క్రేజ్ ఉన్నావారే కావడం మరింత ఇంట్రెస్టింగ్. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, శూర్పణఖగా రకుల్, దశరథ్గా అరుణ్ గోవిల్, కైకేయిగా లారా దత్తా నటిస్తున్నారు. ఇక విభీషణుడిగా విజయ్ సేతుపతి నటిస్తాడని అన్నారు కానీ మళ్లీ అప్ డేట్ లేదు. 3 భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ బడ్జెట్ దాదాపు 750 కోట్లు. ఇందులో సగానికి పైగా స్టార్ల రెమ్యునరేషన్ కోసమే పోతోంది తెలుసా…
రణబీర్ కి ఒక్కో పార్ట్ కి రూ.75 కోట్లు
యానిమల్ మూవీ తర్వాత రణబీర్ మార్కెట్ ఓ రేంజ్ లో పెరిగింది. పైగా రాముడిగా రణబీర్ లుక్ అదుర్స్ అన్నది ప్రేక్షకుల అభిప్రాయం. నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మూడు భాగాలుగా వస్తోన్న రామాయణంలో ఒక్కో భాగానికి 75 కోట్లు తీసుకుంటున్నాడు. అంటే మూడు భాగాలకి కలిపి 225 కోట్లు తీసుకుంటున్నాడని టాక్.
యశ్ కి 3 భాగాలకి రూ. 150 కోట్లు
KGF మూవీతో వరల్డ్ వైడ్ క్రేజ్ సంపాదించుకున్న యశ్ మార్కెట్ తక్కువేం లేదు. ప్రస్తుతం తన చేతిలో ఉన్న భారీ ప్రాజెక్టులలో నితీష్ కుమార్ రామాయణం ఒకటి. పైగా ఇందులో రావణుడిగా నటిస్తున్నాడు యశ్. ఒక్కో భాగానికి రూ. 50 కోట్లు చొప్పున 3 భాగాలకి కలిపి 150 కోట్లు తీసుకుంటున్నాడు.
సాయి పల్లవికి 3 భాగాలకు రూ. 18 కోట్లు
కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే సాయిపల్లవి…సీతగా నటిస్తోంది అనగానే సౌత్ ప్రేక్షకులకు కూడా ఆమూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటోంది హైబ్రిడ్ పిల్ల. ఇప్పటివరకూ సాయిపల్లవి రెమ్యునరేషన్ ఒక్కో మూవీకి 3 కోట్లు ఉండేది. కానీ రామాయణం సినిమాతో డబుల్ అయింది. ఒక్కో పార్ట్ కి 6 కోట్లు చొప్పున మొత్తం మూడు భాగాలకు 18 నుంచి 20 కోట్లు తీసుకుంటోందని టాక్.
ఓవరాల్ గా చూస్తే మూవీ బడ్జెట్ లో సగం మొత్తం వీళ్ల రెమ్యునరేషన్ కే అయిపోతోంది. ఇక మిగిలిన నటుల రెమ్యునరేషన్ కూడా తీసేస్తే ఇక సినిమా కోసం ఖర్చు చేసేది ఎంత?… ఇప్పటికే అయోధ్యలో రామాయణం మూవీకోసం 11 కోట్ల బడ్జెట్ తో సెట్ వేశారు. శ్రీరామనవమి రోజు రణబీర్ షూటింగ్ లో పాల్గొంటాడని…సాయిపల్లవి, యశ్ మాత్రం జూలైలో సెట్ లో అడుగుపెడతారని అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది..