కళా వెంకట్రావుపై రాజకీయ కుట్ర జరిగిందా – చీపురుపల్లికి పంపడం వెనుక వ్యూహం ఏమిటి ?

టిడిపి శుక్రవారం ప్రకటించిన చివరి జాబితా పార్టీలో మరోసారి చిచ్చు రేపింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నేత కళా వెంకటరావుకు చీపురుపల్లి సీటు కేటాయించింది. ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత కలిశెట్టి అప్పలనాయుడుకి విజయనగరం ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసింది. విజయనగరం ఎంపీ, చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కళా వద్ద అధిష్టానం ప్రతిపాదించినా ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. తాను ఎచ్చెర్ల నుంచే పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పారు. మీరుకున్నట్లే చేద్దామని కళాతో చెప్పి చివరకు ఇలా చేశారని పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బొత్సపై పోటీ ఇష్టం లేని కళా వెంకట్రావు

చంద్రబాబు చెప్పినట్లు నియోజకవర్గ ముఖ్యనేతలు చెప్తునా ఎచ్చెర్ల నుంచే తాను పోటీ చేస్తానని దీనిపై కళా వర్గీయులు భగ్గుమన్నారు. కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఎచ్చెర్ల స్థానానికి విజయనగరం బిజెపి అధ్యక్షుడు ఎన్‌.ఈశ్వరరావుకు ఖరారు చేస్తూ బిజెపి ఈ నెల 27న జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎచ్చెర్ల సీటను బిజెపికి కేటాయించడంపై కుతకుతలాడుతున కేడర్‌పై శుక్రవారం ప్రకటించిన జాబితా పుండు మీద కారంలా తయారైంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరించిందంటూ మండిపడుతున్నారు.

ఐవీఆర్ఎస్ సర్వేలు బూటకమని విమర్శలు

ఐవిఆర్‌ఎస్‌ సర్వేలు అంతా బూటకమని, ఇష్టానుసారంగా సీట్లను కేటాయించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయంపై ఇప్పటివరకు ఓపికతో వేచి చూసిన నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను పార్టీకి తెలియజేయాలని నిర్ణయించారు. అనూహ్యంగా ఎంపీ అభ్యర్థిగా ‘కలిశెట్టి’విజయనగరం టిడిపి ఎంపీ అభ్యర్థిగా అనూహ్యంగా కలిశెట్టి అప్పలనాయుడు పేరును పార్టీ ఖరారు చేసింది. మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరును చీపురుపల్లి అసెంబ్లీ, విజయనగరం ఎంపీ అభ్యర్థిత్వానికీ పార్టీ ఐవిఆర్‌ఎస్‌ నిర్వహించింది. దీంతో, గీతకు ఈ రెండింటిలో ఏదో ఒక సీటు ఖాయమంటూ చర్చ నడిచింది. ఆచరణలో అటువంటిదేమీ లేకపోవడంతో ఆమెతో తన అనుయాయులు ఖంగుతిన్నారు.

అనూహ్యంగా ఎంపీ అభ్యర్థి ఖరారు

ఎంపీ అభ్యర్థిగా డెంకాడ ఎంపిపి కంది చంద్రశేఖర్‌ పేరు కూడా పరిశీలనకు వెళ్లినప్పటికీ చివరి క్షణాల్లో తిరస్కరణకు గురైంది. దీంతో కలిశెట్టికి ఎంపీ అభ్యర్థిత్వం వరించింది. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి విజయనగరం ఎంపీ ప్థానానికి అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు గుర్తింపు పొందారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పలనాయుడు రణస్థలం మండలం వి.ఎన్‌.పురానికి చెందిన వారు. కలిశెట్టి సూరప్పమ్మ, బోడినాయుడు దంపతులకు 1975 నవంబరు 8న జన్మించారు. ఆంధ్రా యూనివర్సిటీలో బిఎ, బిఎల్‌ విద్యాభ్యాసం పూర్తి చేశారు. పలు పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేశారు. ఎంపీగా గెలవాలనుకున్న అశోక్ గజపతిరాజుకూ సమస్య ఎదురయింది.