ఇల్లు కొనుగోలు చేయాలన్నా, స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలన్నా వాస్తు నియమాలు పాటిస్తారు. ఇల్లు కొన్నప్పటి నుంచి ఆ ఇంట్లో అడుగు పెట్టేవరకూ మంచి రోజులు, వాస్తు, మూహుర్తాలు అంటా పెద్ద హడావుడే ఉంటుంది. ఇంట్లో పెట్టుకునే ప్రతి వస్తువు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందం, ఆనందం అంటూ ఎన్నో ఆలోచనలు చేస్తారు. అయితే ఇంటికి వేసే రంగులు కూడా మీ సంతోషాన్ని, ప్రశాంతతని డిసైడ్ చేస్తాయని మీకు తెలుసా..
ఆకుపచ్చ
ఇది ప్రకృతికి సంకేతం. ఆకుపచ్చ రంగును చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. విశ్రాంతిగా అనిపిస్తుంది. అందుకే ఇంటికి ముదురు ఆకుపచ్చ రంగు వేసుకోవడం వల్ల ప్రశాంతంగా కనిపిస్తుంది
నీలం
నీలం రిఫ్రెష్ చేసే రంగుగా చెబుతారు. ఈ రంగు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. వీటిలో బ్లూ, నేవీ బ్లూ షేడ్స్ ఉపయోగిస్తే లుక్ బావుంటుంది. ముఖ్యంగా బెడ్ రూమ్ కోసం ఈ రంగుని ఎంపిక చేసుకుంటే బావుంటుంది. బెడ్ రూమ్ లో రెడ్, ఆరెంజ్ రంగులు అస్సలు వేసుకోవద్దు…ఇవి నిద్రకు భంగం కలిగించే రంగులు..
ఊదా రంగు
ఈ రంగు ఆధ్యాత్మికత, సృజనాత్మకత, లగ్జరీకి సూచన. దీనిని విలాసవంతమైన రంగుగా కూడా చెబుతారు.
పసుపు, ఆరెంజ్
పసుపు, నారింజ రంగులు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉండేలా చూస్తాయి. పసుపు రంగు శుభానికి సూచనగా చెబుతారు కదా..ఇంటి గోడలకు ఉన్న పసుపు రంగు కూడా మీలో పాజిటివ్ థాట్స్ ని క్రియేట్ చేస్తుంది. పసుపు రంగు మనోల్లాసానికి, విజ్ఞతకు సూచిక. ఈ రంగు స్టడీ రూమ్, దేవుడి మందిరానికి వినియోగించడం మంచిది
ఇంట్లో అన్ని గదుల పైకప్పులకూ తెలుపు రంగే ఉండేలా చూసుకోవాలి. తెలుపు పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. గదిలోని ఉష్ణోగ్రతనూ తగ్గిస్తుంది.
ఆరెంజ్,గులాబీ రంగులు శక్తికి సూచన…అందుకే వీటిని వంటగది, డైనింగ్ హాల్ గోడలకు వేసుకోవచ్చు.
గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..