వెయిట్ తగ్గించే అద్భుతమైన పానీయాలు ఇవే!

ఈ రోజుల్లో బరువు పెరగడం అనే సమస్యతో బాధపడుతున్న వారిసంఖ్య ఎక్కువే ఉంది. గంటల తరబడి కదలకుండా వర్క్ చేయడం, తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, వ్యాయామం చేయకపోవడం, జంక్ ఫుడ్స్ కి అలవాటు పడడం ప్రధాన కారణం. అయితే ఊబకాయం ఉందంటే దానికి తోడు చాలా అనారోగ్య సమస్యలు క్యూ కట్టేస్తాయి. అందుకే బరువును అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. అందుకు ఈ పానీయాలు ఉపయోగపడతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు…

వాము ఆకుల నీరు
కడుపు సంబంధిత సమస్యలకు వాము ప్రభావవంతంగా పనిచేస్తుంది. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే వాము ఆకులను మరిగించి ఆ నీటిని తాగొచ్చు. ఇది ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

సోంపు టీ
సోంపు గింజలు జీవక్రియను పెంచడంలో బాగా సహాయపడుతాయి. బరువు తగ్గాలన్న ప్రయత్నాలల్లో ఉన్నవారు ఈ పానీయాన్ని తీసుకోవచ్చు.

గ్రీన్ టీ
బరువు తగ్గడానికి గ్రీన్ టీ బాగా ఉపకరిస్తుంది. ఇందులో కాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది, ఇది జీవక్రియను పెంచుతుంది.

బ్లాక్ టీ
బ్లాక్ టీ కూడా బరువు తగ్గించేందుకు మంచి పానీయం. ఇందులో అధిక మొత్తంలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీర బరువును తగ్గించడంలో సహాయపడతాయి.

అల్లం, లెమన్ వాటర్
బరువు తగ్గడానికి అల్లం లెమన్ వాటర్ ని తీసుకోవచ్చు. ఈ పానీయం వల్ల బరువు తగ్గడమే కాకుండా ప్రేగు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

కూరగాయల రసాలు
వివిధ కూరగాయల రసాలు బరువు తగ్గడానికి చాలా బాగా సహకరిస్తాయి

యాపిల్ వెనిగర్
ఆహారం తినే ముందు ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్ నీళ్లలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం ద్వారా జీవక్రియ పెరుగుతుంది. ఆకలి తగ్గుతుంది, అతిగా తినకుండా ఉండటానికి సహాయపడుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.