రియల్ డెలవప్‌మెంట్ : పదేళ్లలో ఆశ్చర్యపోయేలా రైల్వేల అభివృద్ధి – ఏపీకి ప్రధాని మోదీ భారీ సాయం !

మోడీ నేతృతంలో దేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ది చెందింది. రైల్వేకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి.. వేల కోట్లతో ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోజు అనంతపురం లో జరిగిన అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రారంబించారు మోదీ.

మోదీ హయాంలో పరుగులు పెట్టిన రైల్వేలు

రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి అమృత భారత స్టేషన్స్ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 1275 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 72 రైల్వే స్టేషన్లను ఎంపిక చేసి వాటి రూపురేఖలను మారుస్తోంది. వీటి ప నులు శరవేగంగా సాగుతున్నాయి. అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసే రైల్వే స్టేషన్లలో కల్పించే కొన్ని మౌలిక సదుపాయాలను చూసినట్లయితే ప్రతి స్టేషన్లలో అవసరమైన భవనాల నిర్మాణం, అధునాతన శైలిలో ఫ్లోరింగ్ చేయనున్నారు. ప్రస్తుతం 600 మీటర్ల పొడుగుతున్న ప్లాట్ ఫామ్ లను 760 మీటర్ల నుంచి 840 మీటర్ల వరకు అవసరం మేరకు పెంచనున్నారు. ప్రయాణికులు తాకిడి ఎక్కువగా ఉండే ఎన్ ఎస్ జీ 1- 4, ఎన్ జీ 1-2 కేటగిరి స్టేషన్లలో ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

స్వదేశీ టెక్నాలజీతో సెమీ హైస్పీడ్ రైళ్లు

దేశంలో 41 వందే భారత్ రైళ్లు ఇప్పటి వరకు మొదలయ్యాయి. 2004లో కాంగ్రెస్ హయాంలో రైల్వే బడ్జెట్‌ రూ.8000 కోట్ల నుంచి రూ. 29 వేల కోట్లకు పెరిగింది.. మోడీ ప్రభుత్వంలో బడ్జెట్‌ రూ.2.8 లక్షల కోట్ల చేరిందన్నారు. రోజుకు 16 కిలోమీటర్ల రైల్వే నెట్‌వర్క్‌ పెరుగుతోంది.. 5750 కిలోమీటర్ల ట్రాక్ లు, బ్రాడ్ గేజ్ లుగా అభివృద్ధి చేశాం.. రైల్వే లైన్ల విద్యుదీకరణకు రూ.38,650 కోట్లు ఖర్చు పెట్టాం అన్నారు. 26296 కొత్తగా 231 డబ్లింగ్ లైన్లకు రూ.2.7 కోట్ల బడ్జెట్ ఏర్పాటు చేశాం.. అమృత్ భారత్ ద్వారా 1309 రైల్వేస్టేషన్ లు మోడరన్ రైల్వేస్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నారు. వందే భారత్ తో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, చెన్నై, విశాఖకు కనెక్టివిటీ చేశారు. ఐదు వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా ప్రయాణం సాగిస్తాయి.

ఏపీలో విమానాశ్రయాల అభివృద్ధి

ఏపీలో విమానాశ్రయాస అభివృద్ధికి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. తిరుపతిలో ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణం పూర్తి అయింది. విస్తరణ పనులు జోరుగా సాగుతోంది. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టుకు ఎప్పుడో అంతర్జాతీయ హోదా ఇచ్చారు. అతి పెద్ద విమానాలు కూడా దిగేలా… విస్తరణ చర్చలు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక విశాఖ దగ్గర బోగాపురం ఎయిర్ పోర్టు కోసం కేంద్రం అన్ని సహకారాలు అందిస్తోంది. అక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే సాగుతోంది. రాష్ట్రం రివర్స్ టెండర్ల పేరుతో అభివృద్ధి ఆపకపోతే.. ఈ పాటికి బోగాపురం ఎయిర్ పోర్టు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చి ఉండేది.