ప్రజా పోరు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని ఏపీ బీజేపీ నిర్ణయించుకుంది. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేస్తారో గతంలోనే చూపించారు. గతంలో ప్రజాపోరు పేరుతో నిర్వహించిన కార్యక్రమాలు బీజేపీని బలోపేతం చేశాయి. అందుకే ఈ సారి కూడా ఆయనకే సభల బాధ్యతలను అప్పగించారు. పార్టీ కోసం పూర్తి సమయం వెచ్చించడానికి ఏ మాత్రం ఆలోచించని విష్ణువర్ధన్ రెడ్డి మరోసారి ప్రజా పోరుతో ప్రజల వద్దకు బీజేపీని తీసుకెళ్లబోతున్నారు.
గతంలో ప్రజాపోరు సభలు సూపర్ హిట్
సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మొదటి సారి ప్రజాపోరు సభలను నిర్వహించారు. ప్రతి గ్రామానికి.. ప్రతీ వార్డుకు బీజేపీ చేరుకునేలా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. ఎవరు పకడ్బందీగా నిర్వహించగలరు అని హైకమాండ్ ఆరా తీస్తే.. వారికి అందిన మొదటి పేరు విష్ణువర్ధన్ రెడ్డిది. ఒక్క రోజులో ఆ మూల నుంచి ఈ మూలకు పర్యటించి పార్టీ బలోపేతం కోసం కష్టపడేందుకు సంకోచించని మనస్థత్వం.. పార్టీ నేతల్ని…కార్యకర్తల్ని ఉత్సాహపరిచే నాయకత్వ లక్షణాలు ఆయనకు ప్రజా పోరు బాధ్యతల్ని అప్పగించేలా చేశాయి. ఆయన నమ్మకాన్ని నిలబెట్టారు. అది అలా ఇలా కాదు.. హైకమాండ్ ప్రత్యేకంగా ఓ ఉన్నత సమావేశంలో ప్రజాపోరు సభలను ప్రత్యేకంగా ప్రస్తావించి విష్ణువర్ధన్ రెడ్డిని అభినందించింది కూడా.
ప్రజాపోరుతో ప్రతీ మూలకు బీజేపీ
ప్రజాపోరు పేరుతో ప్రతీ మూలకు బీజేపీ వెళ్లింది. ఏడు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లక్ష్యంగా పెట్టుకుని ప్రారంభించి .. పదిహేను రోజుల్లో పదిహేను వేల వరకూ సభలు నిర్వహించారు. అంటే ఎంతగా నిద్రాణంగా ఉన్న క్యాడర్ ను విష్ణువర్ధన్ రెడ్డి బయటకు తీసుకురాగలిగారో అర్థం చేసుకోవచ్చు. ఏపీలో ప్రతీ వార్డులోనూ.. గ్రామంలోనూ మీటింగ్ జరిగింది. బీజేపీ సానుభూతిపరులకు ఏపీలో లోటు లేదని కానీ వారందర్నీ ఏక తాటిపైకి తీసుకు వచ్చే ఓ వ్యవస్థ మాత్రమే లేదనేది బీజేపీలో ఉన్న ప్రధాన లోపం. దీన్ని అధిగమించేలా ప్రజాపోరు సభలను విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. పార్టీలో ఆయన నాయకత్వ సామర్థ్యానికి గీటురాయిగా నిలిచాయి. అందుకే తర్వాత ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనా ప్రచార బాధ్యతలను కూడా విష్ణువర్ధ్ రెడ్డికే ఇచ్చారు.
మరోసారి ప్రజా పోరుతో ప్రజల మద్దతు పొందేలా విష్ణు కృషి
ఎన్నికలకు ముందు ప్రజాపోరు సభలను బీజేపీ హైకమండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హైకమాండ్ నుంచి వచ్చిన సూచనల మేరకు ప్రజా పోరు సభలను ఏర్పాటు చేస్తున్నారు . విష్ణుకే బాధ్యతలు అప్పగించాలని సూచించడానికి కారణంగా గతంలో నిర్వహించిన విధానమే. అందుకే ఈ ప్రజా పోరు సభల్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీని బలోపేతం చేసేలా విష్ణువర్ధన్ రెడ్డి గట్టి ప్రణాళిక రెడీ చేసుకుంటున్నారు. పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని చిరునవ్వుతోనే ఎదుర్కొంటూ ఆయన పార్టీ బలోపేతం కోసం తనదైన శైలిలో కృషి చేస్తున్నారు