గోషామహల్ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా మారింది. మజ్లిస్ మద్దతుతో బీజేపీ ని ఓడించడానికి చాలా కాలంగా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోది. ఈ సారి కూడా అవి ఫలించే అవకాశాలు లేవు. రాజాసింగ్ భావజాలాన్ని వ్యతిరేకంగా సృష్టించి ఆయనపై రౌడీషీట్లు తెరిచి బీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి రాజాసింగ్ గెలుపు ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. బీజేపీ కూడా సస్పెన్షన్ ఎత్తివేసి ఆయనకే టిక్కెట్ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది.
గోషామహల్ టిక్కెట్ తనకే ఇస్తారన్న రాజాసింగ్
గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో ఆయన చెప్పేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థిని నేనే అంటున్నారు రాజాసింగ్. గోషామహల్ లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసేది నేనే.. గెలిచేది కూడా నేనే అని విశ్వాసం వ్యక్తం చేశారాయన. అంతేకాదు బీఆర్ఎస్ తో మరో యుద్ధానికి సిద్ధం కావాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపు కూడా ఇచ్చారు రాజాసింగ్. బీజేపీ హైకమాండ్ తో పాటు తనకు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల మద్దతుందని రాజాసింగ్ చెబుతున్నారు.
మజ్లిస్ చాయిస్ గా బీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ గౌడ్
గోషామహల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంఐఎం డిసైడ్ చేస్తోంది. బీఆర్ఎస్ తరపున ఆనంద్ గౌడ్ ను పోటీ కి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2108లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ కు ఎంఐఎం పరోక్ష మద్దతు ఇచ్చింది. మజ్లిస్ అభ్యర్థిని నిలబెట్టలేదు. మజ్లిస్ ఓట్లన్నీ బీఆర్ఎస్ అభ్యర్థికి వేయించారు. అయినా రాజాసింగ్ .. నలభై వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. రెండు సార్లు గెలిచిన ఆయన గోషామహల్ ప్రజల అభిమానాల్ని చూరగొన్నారు. ఆయన సిద్ధాంతం కోసం పని చేసే వ్యక్తిగా గుర్తించారు.
ఎన్ని కేసులు పెట్టినా అండగా నియోజకవర్గ ప్రజలు
రాజాసింగ్ కు ప్రజలు అండగా ఉన్నారు. ఆయనపై కేసులు పెట్టి అరెస్టు చేసినప్పుడు గోషామహల్ మొత్తం స్వచ్చందంగా బంద్ పాటించింది. మజ్లిస్ అరాచకాలపై ఆయన పోరాడే విధానం వేరుగా ఉంటుంది. గోవులను కాపాడటానికి ప్రాణాలు అర్పిస్తారు. ఉత్తరాది ఎన్నికల్లోనూ ఆయన బీజేపీ కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తారు మొత్తంగా రాజాసింగ్… కు ఎదురులేదని నియోజకర్గం గోషామహల్ గా భావిస్తున్నారు