గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛెంజర్ మూవీలో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంతో ఓ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చెర్రీ. అయితే లేటెస్ట్ గా వచ్చిన ఓ వార్త మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంది..
రాజ్ కుమార్ హిరానితో చెర్రీ
శంకర్ గేమ్ ఛేంజర్ మూవీ తర్వాత బుచ్చిబాబుతో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ జోనర్ లో బుచ్చిబాబు మూవీ తెరకెక్కనుంది. ఇది కూడా పాన్ ఇండియా రేంజ్ లో మైత్రీ మూవీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దీనికి తోడు వినిపిస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే బాలీవుడ్ స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న రాజ్ కుమార్ హిరానీతో చెర్రీ ఓ మూవీ చేయబోతున్నాడట. రాజ్ కుమార్ హిరానీ సినిమాలంటే కమర్షియల్ తో పాటు మంచి మెసేజ్ ఒరియాంటెడ్ కథలు గుర్తుకొస్తాయి. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ హీరోగా ‘డుంకీ’ మూవీతో బిజీగా ఉన్నాడు రాజ్ కుమార్ హిరానీ . డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత మెగా పవర్ స్టార్ తో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట రాజ్ కుమార్ హిరాని.
స్టోరీ డిస్కషన్స్ కంప్లీటెడ్
ప్రస్తుతం ముంబైలో ఉన్న రామ్ చరణ్ తో రాజ్ కుమార్ స్టోరీ డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఓక ఇంటరెస్టింగ్ పాయింట్ చరణ్ కి వినిపించారంట. ఆ స్టోరీ లైన్ చరణ్ కి నచ్చిందని, ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ బిటౌన్ లో నడుస్తోంది. ఈ న్యూస్ మాత్రం నిజమైతే కచ్చితంగా ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. అయితే రాజ్ కుమార్ స్టోరీలైన్స్ అన్ని కూడా సమాజంలో నుంచి వస్తాయి. బీభత్సమైన హీరోయిజం పాత్రలలో ఉండదు. కేవలం హీరో క్యారెక్టర్ ఆ సామాజిక సమస్యలపై సెటైరికల్ గా ఫైట్ చేసే ఒక సామాన్యుడి తరహాలోనే ఉంటుంది. ఇప్పటికే రంగస్థలం లాంటి మూవీలో చిట్టిబాబుగా చెర్రీ నటనకు వందమార్కులు పడ్డాయి. అంటే హీరోయిజం ఎలివేట్ చేసే పాత్రలు మాత్రమే ఎలాంటి క్యారెక్టర్స్ కి అయినా న్యాయం చేస్తానని ప్రూవ్ చేశాడు చెర్రీ. నిజంగా ఈ కాంబినేషన్ సెట్టైతే మెగా అభిమానులకు పండుగే..