దర్శిలో మున్సిపాలిటీ గెలిచిన టీడీపీ చేతులెదుకు ఎత్తేసింది ? – ఇంచార్జును కూడా ఎందుకు పెట్టలేదు?

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కాస్త ప్రత్యేక ఉన్న నియోజకవర్గం. ఏపీలో మున్సిపాలిటీల్లో టీడీపీ గెలిచిన రెండే రెండు మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి,. నుంచి మాజీ మంత్రి శిద్ధా రాఘ‌వ‌రావు 2014లో ప్రాతినిధ్యం వ‌హించారు. త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఆయ‌న ఒంగోలు నుంచి ఎంపీగా పోటీచేసి మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాల్లో శిద్ధా త‌న కుమారుడు సుధీర్‌తో క‌లిసి వైసీపీలో చేరారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున దర్శి నుంచి పోటీచేసిన క‌దిరి బాబూరావు కూడా ఓట‌మిపాలై వైసీపీలో చేరారు. దీంతో అక్కడ టీడీపీకి నాయకుడులేకుండా పోయారు. చివరికి ఓ ఇంచార్జ్ నియమించిన ఎక్కువ కాలం ఉండలేదు.

జనసేనలో చేరే ఆలోచనలో పమిడి రమేష్

శిద్ధా రాఘ‌వ‌రావు వైసీపీలో చేర‌డంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ప‌మిడి ర‌మేష్‌ను ఇన్‌ఛార్జిగా చేసింది. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేశారు. జిల్లా స్థాయి నేత‌ల అండ‌తోపాటు వైసీపీలో ఉన్న అంత‌ర్గ‌త విభేదాల‌ను ఉప‌యోగించుకొని ద‌ర్శి మున్సిపాలిటీని తెలుగుదేశం కైవ‌సం చేసుకోగ‌లిగింది. ఇందులో రమేష్ కృషి ఉంది. ఈ విషయం టీడీపీ శ్రేణుల్లో మంచి ఉత్సాహాన్ని నింపింది. అయితే అక‌స్మాత్తుగా త‌న‌కు అధిష్టానం నుంచి స‌హ‌కారం అంద‌డంలేదంటూ పమిడి ర‌మేష్ ఇన్‌ఛార్జి ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి.. . ఎందుకు రాజీనామా చేశారో ఎవరికీ తెలియదు. టీడీపీ హైకమాండ్ కూడా పట్టించుకోలేదు. రానున్న ఎన్నిక‌ల్లో పోటీనుంచి ఒక‌ర‌కంగా ఆయ‌న త‌ప్పుకున్నారు.

దర్శి బాధ్యత తీసుకున్న గొట్టిపాటి

సుబ్బారావు అనే ఎన్నారై ఈ సీటుకోసం ప్ర‌య‌త్నించారు కానీ స‌రైన హామీ ల‌భించ‌లేద‌ని తెలిసింది. తాజాగా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం త‌ర‌ఫున వైసీపీ నుంచి వ‌చ్చే నేత‌కు సీటు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌చారం న‌డుస్తోంది. టీడీపీ నుంచి శిద్ధా రాఘ‌వ‌రావు, క‌దిరి బాబూరావు వెళ్లారు. వీరికి అక్క‌డ స‌రైన ప్రాతినిధ్యం ద‌క్క‌లేదు. దీంతో ఈ ఇద్ద‌రిలో ఒక‌రు అక్క‌డి నుంచి పోటీచేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీన్ని గురించే చ‌ర్చించుకుంటున్నారు. కానీ ఇది టీడీపీ మైండ్ గేమ్ అన్న ప్రచారం జరుగుతోంది.

వైసీపీలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యేకు టిక్కెట్ డౌటే

ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మద్దిశెట్టి వేణుగోపాల ఉన్నారు. ఆయనకు టిక్కెట్ డౌటేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డికే ఇస్తారని అంటున్నారు. అయితే మద్దిశెట్టి ఏం చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ఆయన జనసేన లేదా బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఏపీలో భారీగా డబ్బు ఖర్చు పెట్టే నియోజకవర్గాల్లో … దర్శి కూడా ఒకటి. మరి ఎలాంటి బిగ్ షాట్స్ అక్కడ పోటీ చేస్తారో వేచి చూడాల్సి ఉంది.