ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతీరెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, భారతీరెడ్డి దంపతులు సోమవారం రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిసారు. గవర్నర్ హరిచందన్ భూషణ్ ఆంధ్రప్రదేశ్ నుంచి చత్తీస్‌ఘడ్ గవర్నర్‌గా బదిలీ అయిన నేపధ్యంలో.. ముఖ్యమంత్రి జగన్ దంపతులు గవర్నర్ దంపతుల మధ్య భేటీ జరిగింది. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. బిశ్వభూషణ్ గవర్నర్‌గా అందించిన సేవలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారంటూ సీఎం పేర్కొన్నారు. మచ్చలేని వ్యక్తిత్వంతో, కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి, రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి ఎంతో సహకారాన్ని అందించారంటూ కొనియాడారు.
అధికార కార్యకాలాపాల నిర్వహణలో ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా, నిండైన హుందాతనంతొ వ్యవహరించారని, అత్యుత్తమ రాజకీయ పరిణితి చూపి రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారని గవర్నర్‌తో సిఎం జగన్ పేర్కొన్నారు. గవర్నర్‌గా రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధించి, మంచి సంబంధాలు సజావుగా సాగడంలో కీలక భూమిక పోషించి రాజ్యాంగానికి వన్నెతెచ్చారని సీఎం అన్నారు.