మీలో స్పెషల్ క్వాలిటీ ఏంటో మీరు పుట్టిన నెల చెప్పేస్తుంది!

ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుంది. అదేంటో తెలుసుకుంటే మీకు మీరే రాజు మంత్రి. అయితే అది మీరు పుట్టిన నెలపై ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి మీలో స్పెషల్ టాలెంట్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి…

జనవరి
జనవరిలో పుట్టిన వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఏం చేయాలి, ఏం వద్దు అనే విషయాలపై స్పష్టమైన అవగాహన ఉంటుంది. సూటిగా మాట్లాడగలరు. ఏదైనా సాధించాలని పట్టుబట్టారంటే సాధించి తీరుతారు. వీరికి స్వతంత్రంగా ఉండడం ఇష్టం…

ఫిబ్రవరి…
ఫిబ్రవరిలో పుట్టిన వారి స్వరం అద్భుతంగా ఉంటుంది. వీరి మాట , పాట మధురంగా ఉంటాయి. మహారాజు లక్షణాలు వీరిసొంతం. తమకు తెలియని విషయాలు తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో ఉంటారు..

మార్చి
మార్చి నెలలో పుట్టిన వారి బుర్రనిండా ఆలోచనలే. ఎలాంటి సమస్యల్లో ఉన్నా ఠక్కున ఐడియాలు ఇచ్చేస్తారు. వీరిలో క్రియేటివిటీ చాలా ఎక్కువ. బాగా సంపాదిస్తారు..

ఏప్రిల్
ఏప్రిల్‌లో పుట్టిన వారు ఏ పని విషయంలో అయినా స్థిరమైన లక్ష్యాలు ఏర్పరుచుకుని వాటిని సాధించేందుకు పక్కాగా ప్రయత్నిస్తారు. మీ దృఢ సంకల్పమే విజయంవైపు నడిపిస్తుంది…

మే
మేలో జన్మించిన వారికి అసాధారణమైన కమ్యూనికేషన్ సామర్ధ్య ఉంటుంది. ఎవ్వరినైనా ఇట్టే ఆకర్షించేస్తారు. అవకాశాలు కల్పించుకుంటారు..

జూన్
జూన్‌లో జన్మించిన వ్యక్తులు కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల అంతులేని ఉత్సాహం కలిగి ఉంటారు. వివిధ రంగాలలో రాణిస్తారు. ఎలాంటి సవాళ్లను అయినా ఎదుర్కొంటారు.

జూలై
జూలైలో జన్మించిన వారు ఇతరులను పోషించడంలో వారిపై శ్రద్ధ వహించడంలో ప్రత్యేకమైన ప్రతిభను కలిగి ఉంటారు. తమ గురించి కన్నా ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందర్నీ ప్రేమిస్తారు..ప్రేమను పంచుతారు..

ఆగస్ట్
ఆగస్ట్ పుట్టినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు.వీరిలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి.

సెప్టెంబర్
సెప్టెంబర్‌లో జన్మించిన వారిలో విశ్లేషణాత్మక ఆలోచన ఉంటుంది. ఏ విషయంపై అయినా పూర్తిగా శ్రద్ధ పెడతారు. చేపట్టే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు.

అక్టోబర్
అక్టోబర్‌లో జన్మించిన వ్యక్తులు వివాదాలను పరిష్కరించడంలో సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మధ్యవర్తులుగా వీళ్లు బెటర్…

నవంబర్
నవంబర్‌లో జన్మించిన వారికి మంచి అభిరుచి ఉంటుంది. తాము అనుకున్నది సాధించానే పట్టుదల ఉంటుంది.

డిసెంబర్
డిసెంబర్ లో జన్మించినవారు మంచి మార్గదర్శకులు అవుతారు. ఇతరులకు మార్గ నిర్దేశం చేయడంలో ముందుంటారు. మీ అనుభవం , జ్ఞానం కారణంగా మీరు సహజ గురువులు అవుతారు.

గమనిక: పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం..