ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో యంగ్ టైగర్

ఇప్పటిరవకూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని హీరోగా చూసిన అభిమానులు ఇప్పుడువిలాన్ గా చూడబోతున్నారు. ఎన్టీఆర్ జైలవకుశ లో నెగిటివ్ రోల్ లో కనిపించినా త్రిపాత్రాభినయంలో అదిఒక పాత్ర పైగా సందర్భాన్ని వచ్చిన నెగెటివిటీ అది. అందుకే అభిమానులు ఆ క్యారెక్టర్ ని కూడా చూసి ఎంజాయ్ చేశారు. ఇక ఆస్కార్ వేదికపై సత్తాచాటిన RRR సినిమాలో NTR కి స్క్రీన్ స్పేస్ తక్కువ ఇచ్చారని ఫ్యాన్స్ గొడవచేశారు. అలాంటిది ఇప్పుడేకంగా ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడట ఎన్టీఆర్

వార్ -2 లో విలన్ గా తారక్
యాక్షన్ థ్రిల్లర్ వార్-2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ లో లాంచ్ అవుతున్నాడు. హృతిక్ రోషన్- ఎన్టీఆర్ ఇందులో మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే యుద్ద భూమిలో ఎదురుచూ స్తున్నట్లు హృతిక్ చేసిన ట్వీట్ అభిమానుల అంచనాల్ని రెట్టింపు చేసింది. డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారని, మల్టీస్టారర్ మూవీ అని అంతా అనుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇందులో టైగర్ హీరోగా కాదు విలన్ గా నటిస్తున్నాడని బీటౌన్ టాక్. విలన్ రోల్ కి ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడని భావించి ఒప్పించారట మేకర్స్. తారక్ కూడా అందుకే ఒప్పుకున్నాడట.

హీరో కన్నా విలన్ హైలెట్!
ఇందులో హీరోపాత్ర కన్నా విలన్ రోలే బాగా డిజైన్ చేశారట. RRR మూవీలో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న తారక్ క్రేజ్ తగ్గకుండా ఆ పాత్ర ఉండబోతోందట. పైగా ధూమ్ సిరీస్ లలో హీరోకన్నా విలన్ రోల్ కే ఫుల్ మార్కులు పడ్డాయ్. అలా ఈ యాక్షన్ మూవీలోనూ ఎన్టీఆర్ క్యారెక్టర్ అదిరిపోతుందంటున్నారు. పైగా బాలీవుడ్ హీరోలంతా ఇప్పుడు క్యూ కట్టి తెలుగు సినిమాల్లో విలన్లుగా నటించినప్పుడు టాలీవుడ్ హీరో అక్కడ సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్ వచ్చినప్పుడు విలన్ గా నటిస్తే తప్పేంటన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొరటాలశివ మూవీ దేవరలో నటిస్తున్నాడు. దీని తర్వాత వార్ 2 షూటింగ్ లో జాయిన్ అవుతాడు, ఆ తర్వాత ప్రశాంత్ నీల్, త్రివిక్రమ్ తో వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

తారక్ ఫ్యాన్స్ ఏమంటారో!
తారక్ అభిమానులు చిన్న చిన్న విషయాలకే హర్ట్ అయిన సందర్భాలున్నాయి. అలాంటప్పుడు ఫుల్ లెంగ్త్ నెగిటివ్ రోల్ అంటే ఎలా రియాక్టవుతారో చూడాలి. వాస్తవానికి ఈ విషయంపై ఆ మూవీ యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఇదే మాట నిజమైతే మాత్రం తారక్ చేస్తున్నది సాహసమనే చెప్పాలి. ఎందుకంటే తారక్ విలన్ గా చేస్తే బాలీవుడ్ ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన రాదు కానీ టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీస్ చేసుకుంటారో చూడాలి మరి.