రాహుల్ వదిలిన తప్పుడు సమాచారం – గట్టిగా సమాధానమిచ్చిన కమలం

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు. ఆయనకు టీమ్ రాహుల్ కు కరెక్టు ఫీడ్ బ్యాక్ ఇవ్వడం లేదన్న చర్చ చాలా రోజులుగా వినిపిస్తున్నదే. వాస్తవ దూరంగానూ, రీజన్ లేని మాటలు మాట్లాడే రాహుల్ ను పప్పు అని కూడా కొందరు పిలుస్తుంటారు. అయినా ఆయన తీరు మార్చుకోవడం లేదు. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలపై రాహుల్ ప్రకటన సహేతుకంగా అనిపించడం లేదు.

రెండు లక్షల ఉద్యోగాలు పోయాయంటున్న రాహుల్

రాహుల్ గాంధీ ఒక క్రేజీ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. పబ్లిక్ రంగ సంస్థల్లో రెండు లక్షల ఉద్యోగాలు పోయాయని ఆయన అన్నారు. దీని వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత నిర్వీర్యమైపోయిందన్నారు. మోదీ మిత్రులైన కొందరు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు సాయం చేసే దిశగా పీఎస్యూలను దెబ్బకొడుతున్నారని రాహుల్ ఆరోపించారు. పైగా ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు మోదీ సర్కారు ప్రాధమ్యాల్లో లేవని కూడా ఒక ట్వీట్ లో రాహుల్ వ్యాఖ్యానించారు.

మాలవీయ గట్టి కౌంటర్

సరైన సమాచారం లేకుండా రాహుల్ మాట్లాడుతున్నారని బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జ్ అమిత్ మాలవీయ ఎదురుదాడి చేశారు. యూపీఏ హాయం కంటే బీజేపీ నేతృత్వ ఎన్డీయే పాలనలో పీఎస్యూల పరిస్తితి ఆశాజనకంగానూ, పురోగమన దిశలోనూ ఉందని చెప్పారు. హెచ్ఏఎల్, ఎస్బీఐ, ఎల్ఐసీలపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేసిందని, వారి ఆలోచన తప్పు అని ఎప్పుడో నిరూపితమైందని మాలవీయ గుర్తు చేశారు…

వాస్తవ పరిస్థితులేమిటి..

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతీ నెల ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయని బీజేపీ గుర్తు చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ , ఎంటీఎన్ఎల్ సంస్థల్లో రేషనలైజేషన్ అమలు చేసినా కూడా పీఎస్యూ ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా తేడా కనిపించలేదని గణాంకాలు చెబుతున్నాయి. మిషన్ రిక్రూట్మెంట్ లో భాగంగా ప్రతీ ప్రభుత్వ రంగ సంస్థలోనూ నియామకాల ప్రక్రియ వేగం పుంజుకుంది. 2013 నుంచి 2022 వరకు పదేళ్ల కాలంలో ఉద్యోగాలు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో 79 వేల 828 మంది కొత్త ఉద్యోగులు వచ్చి చేరారు. మహానది కోల్ ఫీల్డ్స్ లో 36 వేల 418 మంది , నూక్లియర్ పవర్ కార్పొరేషన్లో 22 వేల 235 మంది, నార్తరన్ కోల్ ఫీల్డ్స్ లో 17,674 మంది, హెచ్పీసీఎల్ రాజస్థాన్ రిఫైనరీలో 16,422 మంది కొత్త ఉద్యోగులు విధుల్లో కనిపిస్తున్నారు. కంపెనీల ఆదాయాలు కూడా బాగా పెరిగాయి. 2013-14లో 1.29 లక్షల కోట్లు ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నికర ఆదాయం 2021-22 నాటికి 2.49 లక్షల కోట్లకు చేరింది. ఎక్సైజ్ సుంకం, కస్టమ్స్ సుంకం, జీఎస్టీ, కార్పొరేట్ పన్నులు లోన్లపై వడ్డీ, డివిడెంట్ల రూపంలో కేంద్ర ఖజానాకు ఈ సంస్థలు 5.07 లక్షల కోట్ల రూపాయలు జమ చేశాయి. ఇన్ని అంశాలు తెలుసుకోకుండానే రాహుల్ గాంధీ అర్థం లేని ప్రకటనలు గుప్పిస్తున్నారు.