ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజెపి లో చేరికకి ముఖ్యపాత్ర పోషించినటువంటి బిజెపి ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి హస్తిన నుంచి రాగానే జెడి లక్ష్మీనారాయణపై ఘాటైన విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ పై, కెసిఆర్ కుటుంబం మీద మీకున్న ప్రేమ
మీరు మీ అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు (లేదా) BRS పార్టీలో చేరవచ్చు, మాకు అభ్యంతరం లేదు
అయితే మీరు ఏపీ ప్రజలకు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన కీలక ప్రశ్నలు ట్వట్టర్ వేదికగా జేడీని నిలదీశారు.
ఏపీ లోని నీటిపారుదల ప్రాజక్టులపై కెసిఆర్ కుటుంబం , వారి ప్రభుత్వం వేసిన కేసుల సంగతేంటి?
విభజన సమయంలో ఏపీ ప్రభుత్వానికి పెండింగ్ సొమ్ము ఎంత?
ఆ నిధులు నేటికి ఏందుకు చెల్లించడం లేదు.
నాగార్జున సాగర్ డ్సామ్ దగ్గర ఏపీ పోలీసులపై టీజీ పోలీసుల చేసిన దాడి సంగతి ఏంటి?
కేసీఆర్ నిజంగా ఏపీ శ్రేయోభిలాషి అయితే ఇలా చేసి ఉండేవారు కాదు కదా అని నిలదీశారు.
మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపి ప్రజలను అవమానిస్తారు జేడీ గారు అని విష్ణువర్ధన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు.