ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. వైసీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గంలో ఏకపక్ష విజయాలు ఎవరికీ రాలేదు. కూటమిలో భాగంగా బీజేపీకి ఈ సీటు దక్కింది. బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ వస్తున్నారు సత్యకుమార్ ది ధర్మవరం కాదు.. అసలు అనంతపురం జిల్లానే కాదు. అయినా పొత్తుల మ్యాజిక్‌లో భాగంగా అభ్యర్థి అయిపోయారు.
మొదట్లో టీడీపీ కంచుకోట – ఇప్పుడు వైసీపీ
ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఒక్క 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతూ వస్తోంది. వరదాపురం సూరిగా ప్రసిద్ధి చెందిన సూర్యనారాయణకు నియోజకవర్గం మొత్తం క్యాడర్ ఉంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డిపై 19 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ.. కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ఇదంతా గతం.. ప్రస్తుతం కేతిరెడ్డికి ప్రత్యర్థిగా నియోజకవర్గంలో ఎవరికీ తెలియని సత్యకుమార్ యాదవ్ వచ్చారు.
పట్టు నిలుపుకున్న కేతిరెడ్డి
2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు. 51 శాతం ఓట్లు సాధించిన ఆయన.. టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15వేల 166 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. వెంకట్రామి రెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు.. ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్.. ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. సూర్యానారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఈ కారణంగా ధర్మవరం బాధ్యతలను పరిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు ఇచ్చారు. సీరియస్ గా పని చేసుకున్నారు పరిటాల శ్రీరామ్. పరిటాల వర్గంలో ధర్మవరంలో ఎక్కువే ఉంది. పైగా వరదాపురం సూరితో సరి పడదు.
సూరి వర్గం సహకరిస్తుందా ?
డు సత్యకుమార్ కోసం పరిటాల వర్గం పని చేస్తుంది. కానీ సూరి వర్గం పని చేస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు.
సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువ రోజులు ఆయన నియోజకవర్గంలో తిరుగుతారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసుకుంటారు. ఎవరికైనా సాయం చేస్తానని చెబుతూంటారు. ముఖా ముఖి పోరు జరిగితే వైసీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం సూర్యనారాయణ ఇక్కడ కీలకం కానున్నారు. ఆయన రెబల్‌గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా.