గ్రామ పంచాయతీలు మహాత్మాగాంధీ మానస పుత్రికలు. దేశాన్ని, రాష్ట్రాలను ఎలా పరిపాలిస్తారో గ్రామ స్థాయిలోనూ అలాంటి ప్రభుత్వాలే ప్రజలను పరిపాలించాలని వారి సమస్యలను వారు పరిష్కారం చేసుకోవాలన్న లక్ష్యంతో గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు. కానీ మహాత్ముడి ఆశయాలను చిదిమేస్తూ వైసీపీ సర్కార్ సమాంతర వ్యవస్థను తీసుకొచ్చి గ్రామాలను నిర్వీర్యం చేస్తోంది. ఇందుకే భారతీయ జనతా పార్టీ.. పోరు బాట పట్టింది. పదో తేదీన మహా ధర్నా నిర్వహిస్తోంది.
పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలయాలు
సచివాలయ వ్యవస్థ ఏర్పడిప్పుడే గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోతాయన్న ఆందోళన గ్రామాల్లో కనిపించింది. పంచాయతీరాజ్ వ్యవస్ధ అమల్లో ఉండగా.. పంచాయతీల్ని కాదని సచివాలయాల్ని ఏర్పాటు చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల్లో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలో సమాంతర వ్యవస్ధ ఏర్పాటు ఎందుకని అనేక మంది ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం పథకాల అమలు కోసం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని ప్రకటించింది. కానీ అదే పంచాయతీల ద్వారా ఎందుకు చేయూకడదనేది అందరికీ వచ్చే డౌట్. కానీ ప్రభుత్వ లక్ష్యం పంచాయతీలకు ప్రత్యామ్నాయంగా గ్రామ సచివాలాయాల్ని తీసుకు రావడమే. అందుకే పట్టించుకోలేదు.
సర్పంచ్‌ల అధికారాలు వీఆర్వోలకు ఇస్తూ ఆదేశాలు కూడా !
సర్పంచ్‌ల అధికారాల్ని వీఆర్వోలకు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీసుకున్నారు కూడా. ఈ నిర్ణయం వివాదాస్పదమయింది. సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించారు. దీంతో వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను కత్తిరించింది ప్రభుత్వం. దీనిపై కోర్టుల్లో కేసులు పడ్డాయి. హైకోర్టు ఆ జీవోను సస్పెండ్ చేసింది. అయినా పరిస్థితి మారలేదు. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పాలన సెక్రటరీ, ఈవోపీఆర్‌డీ, డీఎల్‌పీవో, డీపీవో స్థాయిల్లో ఉంటుంది. ప్రస్తుతం సంక్షేమ పథకాలు, ఇతర పౌర సేవలన్నీ సచివాలయానికి దఖలైపోయాయి.
పంచాయతీల నిధులు స్వాహా.. ఇచ్చేవి ఏమైనా గ్రామ సచివాలయాలకే !
గ్రామ స్థాయిలో సర్పంచ్ , పంచాయతీ పాలకవర్గం అజమాయిషీ ఉంటుంది. ఇప్పుడు అంతా గ్రామ సచివాలయాలదే ఆధిపత్యం. వీరి బాధ్యతలు, అధికారాలు అంతంత మాత్రమే. సర్పంచ్‌కు కూడా సచివాలయం మీద పెత్తనం ఉండే అవకాశం లేదు. సర్పంచ్‌లూ నామమాత్రం అయ్యారు. ఇప్పుడు నిధులు కూడా లాగేసుకుంటూడటంతో ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా సర్పంచులను పట్టించుకునే అవకాశం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం గడప గడపకూ ప్రజాప్రతినిధుల్ని పంపినప్పుడు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవడంతో గ్రామ సచివాలయానికి రూ. ఇరవై లక్షల చొప్పున మంజూరు చేసినట్లుగా ప్రకటించారు. కానీ పంచాయతీల ఖాతాల్లో నిధులు మాత్రం లాగేశారు.