ఏపీలో పెద్దఎత్తున నమోదైన పోస్టల్ ఓటింగ్ వైసీపీకి నిద్ర లేకుండా చేస్తుంది. పోస్టల్ ఓటింగ్ కౌంటింగ్ నిలిపివేయడానికి అధికారపక్ష నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలే సాధారణ ఓటింగ్ శాతం రికార్డ్ స్థాయిలో నమోదవ్వడంతో ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమైందన్న అభిప్రాయం ఉంది.
ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారని నమ్ముతున్నారా ?
ప్రభుత్వ ఉద్యోగులు సర్కారుపై వ్యతిరేకతతో ఉన్నారు. ఆ క్రమంలో పోస్టల్ ఓటింగ్ అంతా గవర్నమెంట్‌కి యాంటీగా ఉంటుందన్న భయంతో వైసీపీ దాని లెక్కింపును అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. ఈసీ నిబంధనలను సవాలు చేస్తూ పిటీషన్ వేసిన అధికార వైసీపీకి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఆర్వో సంతకం లేకున్నా ఓటుగా పరిగణించాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు సమర్థించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోబోమని తెల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే కౌంటింగ్ ప్రక్రియ ముగిసాక ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించి ఈపీ దాఖలు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది
రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొత్తం దాదాపు అయిదున్నర లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటి సారి.. శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 38,865 ఓట్లు పోలయ్యాయి. భారీగా పోలైన పోస్టల్ బ్యాలెట్ల కారణంగా ఎన్నికల ఫలితాలు సైతం కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. సగటున ప్రతి నియోజకవర్గంలో 3 వేల మంది వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. దాంతో ఏపీ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ కానున్నాయి.
వ్యతిరేకమైతే సమస్య అవుతుదని అంచనా ?
వైసీపీ కూడా అదే భావనలో ఉంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎక్కువ పర్సెంట్ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడితే ఇబ్బంది అవుతుందని వైసీపీ భావిస్తోంది పోస్టల్ బ్యాలెట్‌కు సంబంధించి వైసిపి కి ఏపీ హైకోర్ట్ లో ఎదురుదెబ్బ తగలడంతో ఆ పార్టీనేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఈసీ తీసుకునే నిర్ణయాల్లో కోర్టులు కూడా జోక్యం చేసుకోవు.