దుబ్బాకలో బీఆర్ఎస్‌పై ఎందుకంత వ్యతిరేకత ? ప్రజల్ని నిండా ముంచినందుకేనా ?

కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ను ఆనుకుని ఉంటుంది దుబ్బాక నియోజకవర్గం. తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటి. కానీ ఉపఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే కుటుంబం నుంచే నిలబడ్డారన్న సానుభూతి కూడా బీఆర్ఎస్ కు దక్కలేదు. పరాజయం పాలైంది. అంత వ్యతిరేకత ఎందుకు ?

మల్లన్న సాగర్‌లో ప్రజల బతుకుల్ని ముంచేసిన కేసీఆర్

దుబ్బాక నియోజకవర్గం మల్లన్నసాగర్‍లో గత ఎనిమిదేళలుగా యుద్ధవాతావరణం ఉన్నది. అన్యాయమైన భూసేకరణను అడ్డుకున్న మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాల ఉద్యమకారులను వెంటబడి వేటాడి మరీ నోరు మూయించారు. ఆ ప్రాంత పోలీస్ అధికారి ఒకరు ఉద్యమకారుడి తలకు గురిపెట్టి బెదిరించారు. పరిహారం ఇవ్వకుండానే ముంచేశారు. ఇలా ముంపు గ్రామాల ప్రజల జీవితాల్ని నట్టేట ముంచేశారు. వారంతా కసిదీరా ఆయన పార్టీని ఓడించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలూ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు దుబ్బాక ప్రజలు స్పష్టమైన అజెండా సెట్ చేసిచ్చారు. అది తెలంగాణ విముక్తి! బీజేపీకి ఓటు వేసిన ప్రజలు, తగిన ప్రత్యామ్నాయాన్ని అప్పుడే ఎంచుకున్నారు.

బలంగా రఘునందన్ రావు

బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న ర‌ఘునంద‌న్‌రావు కూడా కార్య‌క‌ర్త‌లతో వెన్నంటే ఉంటున్నాడు. కార్య‌క‌ర్త‌ల‌కు క‌ష్టం వ‌స్తే తానున్నంటూ భ‌రోసా క‌ల్పిస్తున్నాడు. ఇది పెద్ద నియోజ‌క‌వ‌ర్గం కావ‌డంతో కొన్ని మండ‌లాల్లో ర‌ఘునంద‌న్‌రావు పార్టీని నిర్మించడానికి కష్టపడ్డారు. ఆయన ఎన్నిక తర్వాత నియోజకవర్గంలో బీజేపీ పటిష్ట స్థితికి చేరింది. బీఆర్ఎస్ నుంచి పలువురు లీడర్లు బీజేపీలో చేరుతుండడంతో అధికార పార్టీ బలహీనపడింది.

బలహీనంగా కాంగ్రెస్

సెంటిమెంట్ సాయంతో అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో దుబ్బాక కంచు కోట, కాషాయకోటగా మారింది. దుబ్బాక నియోజక వర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకు టికెట్ దక్కినప్పటికి తో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేసిన రఘునందన్ రావు స్వల్ప మెజారిటీతో విజయం సాధించి దుబ్బాక నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగుర వేశారు. ఒకప్పుడు టీడీపీ హాయంలో దొమ్మట ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి అనారోగ్యంతో మరణించగా, ఆయన కుమారుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గా ఉప ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీలో టికెట్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కే ఖరారు అయింది. కానీ ఆయన రేసులో ఉన్నారో లేదో అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కేసీఆర్ సన్నిహితుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి టిక్కెట్

సోలిపేట కుటుంబాన్ని పక్కన పెట్టేకేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డికి చాన్సిచ్చారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కుమారుడు సోలిపేట సతీష్ ను పట్టించుకోలేదు. ఎప్పటినుంచో ఎమ్మెల్యే కావాలనుకుంటున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చాన్స్ పొందారు. అయితే ఆయనపై కత్తి దాడి జరగింది. పథకాల లబ్దిదారుల్లో చూపుతున్న వివక్ష ఈ సారి బీఆర్ఎస్ కు సమస్యగా మారనుంది.