కుప్పంలో చంద్రబాబు బలగం – ఎప్పుడూ చేయనంతగా మోహరించేస్తున్నారెందుకు ?

కుప్పం మున్సిపాలిటీలో ఓటమి తర్వాత చంద్రబాబునాయుడు.. తన నియోజకవర్గంలో ఓటర్లు చేజారిపోకుండా.. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం ఎదురు కాకుండా కొత్త ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. వరుసగా ఏడుసార్లు గెలిచినా గెలుపు కోసం పెద్దగా శ్రమించని కుప్పంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించి తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందుకే టార్గెట్ లక్ష అనే మిషన్ పెట్టుకున్నారు. కానీ గెలుపు కోసమే టార్గెట్ అని.. మెజార్టీ కాదని వైసీపీ వర్గాలు సెటైర్లు వేస్తున్నరారు.

బలగాన్ని నియమించిన చంద్రబాబు

కొద్ద ిరోజుల కిందటే నియోజకవర్గ పాత సమన్వయ కమిటీ స్థానంలో కొత్తగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా తూర్పు రాయలసీమ పట్టుభద్రులు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను నియమించారు. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పీఎస్ మునిరత్నం.. సమన్వయ కమిటీ కన్వీనర్‌గా ఏఎంసీ మాజీ ఛైర్మన్ ఆర్ చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించారు. కమిటీలో సభ్యులుగా.. గౌనివాని శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ , పీ మనోహర్, చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి , డీఎస్ త్రిలోక్, కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి , జీఎం రాజు, మాజీ ఎంపీపీ, సాంబశివన్, మాజీ ఎంపీపీ , సత్యేంద్ర శేఖర్, మాజీ ఏఎంసీ ఛైర్మన్ , వీజీ ప్రతాప్ కుమార్, మాజీ సర్పంచ్ రాజగోపాల్ , డాక్టర్ వెంకటేష్, మాజీ ఎంపీపీ , ఎం మణి , జకీర్ఇలా మొత్తం 31మందిని సభ్యులుగా ఉన్నారు. అలాగే నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులుగా గుడుపల్లి మండలం శెట్టిపల్లికి చెందిన వెంకటేష్‌‌ను నియమించారు. కుప్పం పట్టణంలో పార్టీ బలోపేతం కోసం కోర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. కోర్‌ కమిటీ సభ్యులుగా, పట్టణ అధ్యక్షులు రాజ్‌ కుమార్‌, ప్రధానకార్యదర్శి ఆర్ముగంతో పాటు, ఆరుగురు కౌన్సిలర్లు, ప్రతాప్‌ కుమార్‌, కన్నన్‌, సాంబశివన్‌, డా.వెంకటేష్‌, త్రిలోక్‌ లు సభ్యులుగా ఉంటారు.

మరో రెండు కమిటీల నియామకం

కుప్పం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రెండు పార్టీ కమిటీల్ని నియమించారు. ఇందులో ఒకటి టీడీపీ విస్తరణ విభాగం కాగా.. మరొకటి కార్యకర్తల సంక్షేమ విభాగం. ఈ రెండూ టీడీపీ కోణంలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ కార్యకర్తల్ని బెదరగొట్టి వైసీపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్న వేళ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న బీఆర్ సురేష్ బాబును దీంతోపాటు కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం కన్వీనర్‌గా కూడా నియమించారు. అలాగే డీఎస్ త్రిలోక్‌ను కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్‌గా నియమించారు. అలాగే కుప్పం మండలానికి చెందిన పార్టీ నేత మణిని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. మరోవైపు రామకుప్పం మండలానికి చెందిన డాక్టర్ గిరిబాబు నాయక్‌ను ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇతర నేతల్ని చేర్చుకునేందుకు ప్రత్యేకంగా కమిటీలు

అలాగే కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం, కార్యకర్తల సంక్షేమ విభాగంలో 9 మంది చొప్పున సభ్యుల్ని కూడా నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ విస్తరణ విభాగం పార్టీలో కొత్తగా చేరే వారిని ఆహ్వానించి చేరికలు చూస్తుంది. అలాగే కార్యకర్తల విభాగం పార్టీలో కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు వారి బాగోగులు చూసేలా పనిచేస్తుంది. దీంతో ఈ రెండు విభాగాలు కూడా వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబుకు అత్యంత కీలకం కాబోతున్నాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ వారంలో మూడు రోజులు పాటు కుప్పంలోనే ఉంటున్నారు.