క్రౌడ్ ఫండింగ్ ఎందుకు ధీరజ్ సాహులు ఉండగా ? – కాంగ్రెస్ ప్రయత్నాలు ఫెయిల్ !

138 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నిధుల సమస్య వెంటాడుతోంది. అత్యధిక కాలం అంటే.. ఆరేడుదశాబ్దాల పాటు కేంద్రంలో ..రాష్ట్రాల్లో చక్రం తిప్పిన ఆ పార్టీకి పట్టుమని ఐదు వందల కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదని చెప్పి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. అయితే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ కు నిధుల లోటు లేదని బ్యాంకుల్లో కనిపించని నిగూఢమైన సంపద కాంగ్రెస్ ఉందన్న అనుమానాలు బలపడుతున్న సమయంలో అలాంటిదేమీ లేదని నమ్మించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

కాంగ్రెస్ పై నమ్మకం లేకపోవడంతో తగ్గిపోయిన విరాళాలు

కొన్ని ప్రాంతీయ పార్టీల కన్నా ఘోరంగా కాంగ్రెస్ పార్టీకి విరాళాలు తగ్గిపోయాయి. అనేక రాష్ట్రాల్లో అధికారం కూడా లేకపోవడంతో విరాళాలు ఇచ్చే వారూ తగ్గిపోయారు. కాంగ్రెస్ పార్టీ రాను రాను క్షీణించి పోతోంది. ఆ పార్టీ ప్రజాస్వామ్య పోకడలకు దూరం అవుతోంది. అందుకే కార్పొరేట్ విరాళాలు కూడా తగ్గిపోయాయి. చివరికి పార్టీకి విరాళాలివ్వాలని ప్రజల్ని కోరుతూ.. ఓ ఉద్యమాన్ని ప్రారంభించింది. 138 రూపాయలు లేదా..1380 లేదా .., 13800 ఎంతైనా ఇవ్వొచ్చని ప్రజల్ని కోరుతోంది.

క్రౌడ్ ఫండింగ్ పై బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ క్రౌడ్ ఫండింగ్‌పై బీజేపీ స్పందించింది. 60 ఏళ్లుగా దేశాన్ని దోచుకున్నవారు ఇప్పుడు విరాళాలివ్వాలని అంటున్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూ ఇంట్లో దొరికిన నోట్ల కట్టల వ్యవహారం నుంచి దేశం దృష్టి మరల్చడానికే ఆ పార్టీ ఇలాంటి పనులు చేస్తోందని విమర్శిస్తోంది. ప్రజా ధనాన్ని గాంధీ కుటుంబానికి సమర్పించడానికే ఇలాంటి పనులు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. ధీరజ్ సాహు లాంటి వాళ్లు కాంగ్రెస్ పార్టీలో కోకొల్లలుగా ఉన్నారు.

పార్టీని నడిపేందుకు వేల కోట్లు అవసరమా ?

పార్టీని నడపడానికి వేల కోట్లు అవసరం లేదు. ఎవరూ జీతానికి పని చేయరు. అందరూ స్వచ్చందంగానే పని చేస్తారు. కానీ క్రౌడ్ ఫండింగ్ పేరుతో.. కాంగ్రెస్ నాటకాలాడుతోందని అంటున్నారు. సామాన్యుల నుంచి వచ్చే స్పందనను బట్టి… త మపార్టీకి ఉన్న ఆదరణను అంచనా వేసుకుంటారు. అందుకోసమే ఈ పని చేస్తోందని అంటున్నారు. తమకు వందల కోట్లు లేవని కాంగ్రెస్ కంగారు పడుతోంది కానీ.. వారి పార్టీకి చెందిన ఒక్కో నేత దగ్గర అంత కంటే ఎన్నో రెట్లు ఎక్కువ నగదు ఉంటుందని ధీరజ్ సాహు బయట పెట్టారు.