ఎవరీ వివేకా రామస్వామి ? తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆయనేనా

ఇప్పుడు అమెరికాలో ఒకరే హాట్ టాపిక్ గా ఉన్నారు. ఆయన పేరు వివేక్ రామస్వామి. తర్వాత అమెరికా అధ్యక్షుడు అవుతారని అనుకుంటున్నారు. ఆయన వయసు 37 ఏళ్లు మాత్రమే. ఇటీవల అమెరికా అధ్యక్ష ప దవికి పోటీ పడేవారిలో బారతీయ సంతతి వాళ్ల పేర్లూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రస్తుతం కమల హారిస్‌ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వివేకా రామస్వామి హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ప్రైమరీ డిబేట్స్ ఆయన స్పందనలు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

కేరళ దంపతులకు అమెరికాలో జన్మించిన రామస్వామి

వివేక్ రామస్వామి తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయులే. అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ పుట్టారు కాబట్టి రామస్వామికి అమెరికా పౌరసత్వం లభించిది. 37ఏళ్ల వివేక్‌ గణపతి రామస్వామి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి బిఏ, యేల్స్‌ లా కళాశాలలో చదివారు. బయోటెక్‌ కంపెనీ స్థాపించి వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నారు. రానున్న అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం వివేక్‌ రామస్వామి .. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‌, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డీసాంటిస్‌లతో గట్టిగా పోటీపడుతున్నారు. చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, అమెరికా వైభవాన్ని నిలుపుతానని టీవీ, ఆన్‌లైన్‌ ప్రసంగాల్లో తన అభిప్రాయాలను ప్రజల స్పష్టంగా వివరిస్తూ మెప్పును పొందుతున్నారు.

అమెరికాను నడిపించే సామర్థ్యం ఉన్న నేతగా గుర్తింపు

టీవీ డిబేట్లు అమెరికా రాజకీయాల్లో కీలకం. ఎక్కు వమంది ప్రజలు చూస్తారు. తమను పరిపాలించబోయే నేతల గుణాగుణాలను అంచనా వేస్తూంటారు. నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. దేశంలోని ప్రముఖులు కూడా ఓ అభిప్రాయానికి వస్తారు. టీవీ డిబేట్లలో వివేక్‌ రామస్వామి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కూడా సమర్థించారు. వ్యక్తిత్వం, అభిప్రాయాలు అమెరికా ప్రగతికి ఉపయుక్తంగా, ఆశాజనకంగా ఉన్నాయని ‘ఎలాన్‌ మస్క్‌‘ కూడా ప్రకటించడంతో అమెరికన్ల దృష్టి రామస్వామి అభ్యర్థిత్వం వైపు మళ్లింది. ఇప్పటి వరకూ రిపబ్లికన్‌పార్టీ అధ్యక్ష పదవి పోటీలో డొనాల్డ్‌ ట్రంప్‌ ‌ అభ్యర్థిత్వంలో ముందంజలో ఉన్నప్పటికీ అతనిపై కొనసాగుతున్న కోర్టు కేసులు కొంత అడ్డుపడే అవకాశం ఉండవచ్చని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో వివేకా రామస్వామి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

యువకుడికి మద్దతిచ్చేందుకు అమెరికన్ సమాజం రెీడ !

వివేకా రామస్వామి దీర్ఘ కాలిక ప్రణాళికల్లో ఉన్నారు. ఆయన వయసు 37 ఏళ్లు మాత్రమే . పోటీ కేవలం తన ఒక్కడి గురించే కాదని…తన స్వార్థం గురించే అనుకుంటే.. ఇంత చిన్న వయసులో ఉపాధ్యక్ష పదవి దక్కడం చాలా మంచిదేనని గడుసుగా సమాధానం చెబుతున్నారు. కానీ తన ప్రయత్నం నా దేశాన్ని పునరుద్ధరించడానికి, పునరేకీకరించడానికని చెబుతున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఓటర్లు, 35 ఏళ్ల లోపు వయసున్న వారి మద్దతు కూడగట్టడంలో వివేక్ రామస్వామి పురోగతి సాధిస్తున్నట్టు అమెరికా పోల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తన రాజకీయ ప్రచారం ‘న్యూ అమెరికన్ డ్రీమ్’ పై రామస్వామి దృష్టి సారించారు. ఆయన అధ్యక్షుడైతే…. అది ప్రపంచంలో మరో గొప్ప మార్పునకు కారణం అవుతంది.