తణుకులో తళుక్కుమనేది ఎవరు ? కారుమూరికి కారమేనా ?

తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న తణుకు నియోజకవర్గంలో YSR హయాంలో ఎమ్మెల్యేగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో గెలుపొందారు. 2014లో YCPలో చేరిన ఆయన.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది. రాష్ట్రంలో రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో మినిస్టర్‌గా అవకాశాన్ని కారుమూరి దక్కించుకున్నారు.

స్వల్ప తేడాతో ఓడిపోయారనే సానుభూతితో అరిమిల్లి

కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ 2019 లో ఓటమి అనంతరం నిరుత్సాహం పడకుండా.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా లోకేష్ పాదయాత్ర నిర్వహించిన సమయంలో నియోజకవర్గంలో ఆయన చాలా హుషారుగా పాల్గొని.. పశ్చిమగోదావరి జిల్లాలో యువగళం పాదయాత్ర సక్సెస్ కావటంతో తనవంతు కృషి చేశారని పార్టీ నేతలతో పాటు అధిష్టానం వద్దా గుర్తింపు తెచ్చుకున్నారట. ఎమ్మెల్యేగా చేసిన అనుభవం.. తనకంటూ సొంత క్యాడర్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమలు చేశారు.

జనసేన బలం కతలసి వచ్చే చాన్స్

వాటిపైనే ఆరిమిల్లి పూర్తిగా ఆశలు పెట్టుకోవటం సహా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతతో తాను గెలిస్తాననే భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. పైగా..కూటమిలోని ఇతర పార్టీ నేతల సహకారం పూర్తిగా తనకు అందిందని… ప్రజలు కూడా తనను ఆశీర్వదించారని ఆరిమిల్లి భావిస్తున్నారట. 2014లో రాధాకృష్ణ జనసేన పార్టీ మద్దతుతో సుమారు 32 వేల మెజార్టీతో గెలవటమే కాకుండా..జిల్లాలోనే రెండోస్థానంలో నిలిచారు. 2019లో త్రిముఖ పోటీతో ఓటుబ్యాంక్‌ చీలి.. రెండు వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు రాధాకృష్ణ.

కారుమూరి తీరుపై ప్రజల్లో వ్యతిరేకత

టీడీపీకి కంచుకోట ఉన్న తణుకులో ఇతర పార్టీల నుంచి నేతలను టీడీపీలోకి రప్పించటంలోనూ ఆయన సఫలీకృతమయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. దీంతో ఈసారి తనకు విజయం ఖాయమనే భావనలో ఆయన ఉన్నారు . 2019లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల స్వల్ప ఓటమి చెందిన ఈ యువనేత.. ఈ సారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తాననే ధీమాతో ఉన్నారట. ఏపీలో వచ్చే భారీ మెజార్టీ స్థానాల్లో తణుకు ఉంటుందనే భావనలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు.