ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీజేపీ వైపు చూస్తున్న నేతలెవరు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ అధికార పార్టీగా ఉంది. కానీ ఆపార్టీ తరపున చివరిలో నిలబడటానికి అభ్యర్థులు భయపడ్డారు. ఓడిపోయిన తర్వాత చాలా మంది రాజీనామా చేశారు. ముఖ్యంగా రాయలసీమలో నేతలు పెద్ద ఎత్తున బీజేపీలో చేరారు. వచ్చే ఎన్నికలకు ముందు కూడా ఈ సారి మరింత ఎక్కువ చేరికలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సారి టీడీపీతో వైపు వైసీపీ నేతలు కూడా వచ్చేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

రెండు పార్టీల్లో కీలకనేతలు బీజేపీతో సంప్రదింపుల్లో !

అనంతపురం జిల్లా వైసీపీ, టీడీపీలో లెక్కలేనన్ని గ్రూపులు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి. ఒకే పార్టీలో ఉండి పోటీ చేసి.. ప్రత్యర్థుల్ని ఓడించుకుదామనకునేంత రాజకీయాలు వారి మధ్య ఉంటాయి. వీటన్నింటితో విసిగిపోయి.. బీజేపీలో చేరి బలాన్ని నిరూపించుకోవాలనుకునే నేతల ఆలోచన క్రమంగా బయటకు వస్తోందని చెబుతున్నారు. అధికార పార్టీలో బాగా ప్రాధాన్యం పొందిన ఓ నేతను ఇటీవల పట్టించుకోవడం లేదు. ఆయనపై హైకమాండ్ కూడా శీతకన్నేయడంతో బీజేపీలో చేరి సత్తా చూపించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తనక తెలిసిన కర్ణాటక బీజేపీ నేతల ద్వారా సంప్రదింపులు కూడా ప్రారంభించినట్లుగా చెబుతున్నారు.

టీడీపీలో బలగం ఉన్న నేత చూపు మొదటి నుంచి బీజేపీ వైపే !

టీడీపీ ఓడిపోగానే అనంతపురం నుంచి చాలా మంది బీనేతలు బీజేపీలో చేరారు. ధర్మవరం నుంచి గోనుగుంట్ల సూర్యనారాయణ కూడా బీజేపీ నేతగా మారారు. అలాగే జిల్లా వ్యాప్తంగా బలగం ఉన్న ఓ టీడీపీ నేత చూపు మొదటి నుంచి బీజేపీ వైపే ఉందని అంటున్నారు. ఎన్నికల సమయం చూసుకుని ఆయన జాతీయ పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ఢిల్లీబీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. బీజేపీకి మొదటి నుంచి అనంతపురం జిల్లాలో కొంత ఆదరణ ఉంది. పొత్తులు.. ఇతర రాజకీయాలతో కొంత నష్టపోయింది. ఇప్పుుడు మళ్లీ పుంజుకుంటోంది.

ఒంటరిపోరుతో బలపడతామనే ఆలోచన !

ఒంటరిగా పోటీ చేస్తే రెండు పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలు బీజేపీ వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ముందు ముందు మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూండటం.. టీడీపీపై ప్రజల్లో నమ్మకం కలగకపోతూండటంతో .. బీజేపీ వైపు ఎక్కువ మంది చూసే అవకాశాలున్నాయంటున్నారు. ముందు ముందు హైకమాండ్ ఏపీ బీజేపీపై దృష్టి కేంద్రీకరిస్తే కీలక నేతలు చేరడం ఖాయమని చెప్పుకోవచ్చంటున్నారు.