హిందూపురంలో సుడిగాలి ధర్నాలు – వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న బీజేపీ

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భారతీయ జనతా పార్టీ నేతలు కదం తొక్కుతున్నారు. రాష్ట్రంలో మిగతా చోట్ల లేని విధంగా ప్రభుత్వంపై పోరుబాట ఎంచుకున్నారు. ప్రతి రోజూ ఏదో ఓ చోట ధర్నాలు చేస్తూ తమ ప్రతాపం చూస్తున్నారు. వీరు ఎప్పుడు ఎక్కడ ముట్టడి చేస్తారో తెలియక పోలీసులు సైతం కంగారు పడుతున్నారు. ఈ ధర్నాలు, ఆందోళనలకు.. ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు.

ప్రభుత్వంపై సమరం ప్రకటించిన బీజేపీ

ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్మువర్ధన రెడ్డి గతంలో రాష్ట్ర, జాతీయస్థాయిలో పార్టీకి సేవలు అందించేందుకు బిజీగా ఉండేవారు. హోంటర్ఫ్ అయిన హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలకు తక్కువ సమయం కేటాయించేవారు. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఇక పార్లమెంట్ ఎన్నికలే ముందు ఉండటంతో.. ఇక సొంత గడ్డపై దృష్టి పెట్టారు. హిందూపురంలో వరుసగా ఉద్యమాలు ప్రారంభించారు. బీజేపీ క్యాడర్ అంతా గత నెల రోజుల్లో విపరీతంగా యాక్టివ్ అయ్యారు. వారికి ప్రజల మద్దతు లభిస్తోంది.

ప్రభుత్వంపై ప్రజల అసంతృప్తిని బీజేపీకి మద్దతుగా మలుస్తున్న వైనం

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఎంత స్థాయిలో అంటే… ఐదేళ్లలో కనీస మేలు చేయాలేదన్న భావనలో ఉన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న దానికి గ్రౌండ్ రియాలిటీకి తేడా ఉందని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తించారు. అయితే వారికి అండగా ఉండేందుకు ఇతర ప్రతిపక్షాలు సమర్థంగా ముందుకు రాలేకపోయాయి. ఈ లోటును గుర్తించి వారి కోసం రంగంలోకి దిగారు. ప్రజాసమస్యలపై పోరాటంలో ప్రజల నుంచి బీజేపీకి వస్తున్న మద్దతే దీనికి సాక్ష్యంగా కనిపిస్తోంది.

క్రమంగా బలపడుతున్న బీజేపీ

ప్రజాపోరాటాలు చేస్తే .. వాటికి ప్రజలమద్దతు లభిస్తే.. పార్టీలు బలపడతాయి. దానికి బీజేపీ బలపడటం ఉదాహరణగా కనిపిస్తోంది. బీజేపీ ఇప్పుడు హిందూపురం నియోజకవర్గంలో క్రమంగా బలపడుతోంది. ప్రతీ గ్రామం నుంచి బీజేపీ సానుభూతిపరులు బయటకు వస్తున్నారు. ప్రజల్లోకి వచ్చి మరింతగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే మూడు నెలల పాటు మరింత ఎక్కువగా బీజేపీ కార్యక్రమాలు హిందపురం పార్లమెంట్ పరిధిలో ఉండనున్నాయి.